Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృతిసనన్ హీరోయిన్ ఎలా అయ్యిందో అర్థం కావట్లేదు.. భైరవి గోస్వామి పిచ్చి వాగుడు

బాలీవుడ్ హీరోయిన్, మహేష్ బాబు నేనొక్కడినే స్టార్ కృతిసనన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియా మారుమ్రోగిపోతోంది. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద అవకాశాలు లేకపోయినా.. దొరికిన అవకాశాలు చేసుకుంటూ పోతున్న కృతిసనన్‌పై పలు

Webdunia
సోమవారం, 31 జులై 2017 (14:30 IST)
బాలీవుడ్ హీరోయిన్, మహేష్ బాబు నేనొక్కడినే స్టార్ కృతిసనన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియా మారుమ్రోగిపోతోంది. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద అవకాశాలు లేకపోయినా.. దొరికిన అవకాశాలు చేసుకుంటూ పోతున్న కృతిసనన్‌పై పలు హిందీ టివి సీరియల్స్, సినిమాల్లో నటించిన భైరవి గోస్వామి అనే నటి ఘాటుగా విమర్శలు చేసింది. ప్రస్తుతం కృతి సనన్ అర్జున్ కపూర్ ముబారకన్ సినిమాలో ఓ ఐటమ్ పాటకు డ్యాన్స్ వేసింది. 
 
ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. కృతిపై భైరవ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేసింది. రాబ్తా సినిమా ఫ్లాప్ కావడంతో కృతి బాగా డిస్టబ్ అయినట్లు కనిపిస్తోందని కేఆర్కే చేసిన ట్వీట్‌కు రీ ట్వీట్ చేస్తూ.. అవును ఆమెకు పిచ్చెక్కినట్లుంది. అలానే ప్రవర్తిస్తోంది. ఇంతకీ కృతి హీరోయిన్ ఎలా అయ్యిందో అర్థం కావట్లేదని భైరవి గోస్వామి విమర్శించింది.
 
కృతి సనన్‌ కంటే కాలేజీల్లో చదివే విద్యార్థినులు అందంగా ఉంటారని కామెంట్ చేసింది. దీనిపై కృతిసనన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కృతిని విమర్శించే ముందు తనేంటో తెలుసుకోవాలని కామెంట్లు చేశారు. సినిమాల్లో అవకాశాలు లేక సీరియల్స్‌లో నటిస్తున్న భైరవి.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా పాపులర్ కావాలని ప్రయత్నిస్తుందని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments