Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నగర రోడ్లపై అర్థరాత్రిపూట హన్సిక ఎలాంటి పని చేసిందో తెలుసా?

సాధారణంగా ఎవరికైనా సహాయం చేయాలంటే కొందరు చడీచప్పుడుకాకుండా తమ వంతు సాయాన్నిచేస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో హన్సిక కూడా చేరిపోయింది. హ‌న్సిక చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఇంతకీ

Webdunia
బుధవారం, 13 జులై 2016 (13:08 IST)
సాధారణంగా ఎవరికైనా సహాయం చేయాలంటే కొందరు చడీచప్పుడుకాకుండా తమ వంతు సాయాన్నిచేస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో  హన్సిక కూడా చేరిపోయింది. హ‌న్సిక చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఇంతకీ ఈ భామ ఏం చేసిందో తెలుసా...? 
 
చెన్నైలో రాత్రి సమయాల్లో రోడ్ల మీద నిద్రపోతున్న నిరాశ్రయుల దగ్గరకు నిశ్శబ్దంగా వెళ్లి వాళ్ల పక్కన సామాగ్రిని ఉంచి వారికి తన వంతు సాయం చేసింది. ఆమె చేస్తున్న ఈ సమాజసేవను వీడియో తీసిన అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 
 
వర్షాకాలం కారణంగా రోడ్డు మీద ఉండే  ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారని వాళ్ల బాధను అర్థం చేసుకుని వారికి కప్పుకోవడానికి దుప్పట్లు, తినడానికి ఆహారం, మంచి నీరు అందించింది. అలాగే ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలుపుతూ 'ఇది వర్షాకాలం. దయచేసి మీరు కూడా మీ వంతు సాయం చేయండి' అంటూ ట్విట్టర్‌లో సందేశమిచ్చింది. ఈ బొద్దుగుమ్మ హన్సిక చేసిన ఈ మంచి పనికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments