Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌతమీపుత్ర శాతకర్ణి' స్టోరీ లీక్ : రెండు క్లైమాక్స్‌లు షూట్ చేసిన క్రిష్

దర్శకుడు జాగర్లముడి రాధాకృష్ణ (క్రిష్), బాలకృష్ణ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య చేసిన యుద్ధ విన్యాసాలు,

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (10:37 IST)
దర్శకుడు జాగర్లముడి రాధాకృష్ణ (క్రిష్), బాలకృష్ణ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య చేసిన యుద్ధ విన్యాసాలు, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. బాలయ్య సరసన వైశిష్ఠి దేవిగా శ్రియ శరణ్ నటిస్తోంది. బాలీవుడ్ నటి హేమమాలిని శాతకర్ణి తల్లిగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
మరోపక్క ఈ సినిమాకు క్లైమాక్స్ ఏ విధంగా చిత్రీకరించి ఈ సినిమా ముగింపు చూపెట్టాలి అని మధన పడుతున్న క్రిష్ ఆలోచనలకు పరిష్కారం దొరికినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్రిష్ ఈ సినిమాను రెండువిధాలుగా ముగించాలి అన్న ఆలోచనలతో రెండు క్లైమాక్స్‌లు చిత్రీకరించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిగా ఈ సినిమా చివర్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' మరణంతో ఈ సినిమాను ముగించడం. అయితే ఆ ముగింపు బాలకృష్ణ అభిమానులకు ఏ మాత్రం నచ్చదు అన్న ఉద్దేశ్యంతో క్రిష్ ఈ సినిమాకు ఒక వినూత్నమైన ఎండింగ్ సీన్‌ను క్రియేట్ చేసినట్లు సమాచారం. 
 
'గౌతమీపుత్ర శాతకర్ణి' జీవితంలో చేసిన యుద్ధాలలో అత్యంత చిరస్మరణీయమైన భీకర యుద్ధంతో ఈ సినిమా ముగింపు చేస్తారట. ఈయుద్ధం తర్వాత శాతకర్ణి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిరోహించిన సీన్ చూపెట్టి ఆ తర్వాత వెంటనే భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను చూపెట్టి ఆ తర్వాత మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు చూపించి జాతీయ పతాకం రెపరెపలాడుతున్న షాట్‌తో ఈ సినిమాను ముగిస్తారట. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధం 20 నిముషాలు ఉండటమే కాకుండా అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ కూడా ఉంటాయని సినీనిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments