Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్‌-4'లోకి గుండెల్లో రైళ్లుపరుగెత్తించే గంగవ్వ

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (15:24 IST)
ప్రముఖ టీవీ చానెల్‌లో బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభంకానుంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ జాబితా ఒకటి లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తాజాగా యూట్యూబ్ ప్రేక్ష‌కుల‌కి బాగా సుపరిచితురాలైన గంగ‌వ్వ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈమె త్వరలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందట. 
 
తెలంగాణ యాస‌తో చుట్టు ప‌క్క‌న వాళ్ళ గుండెళ్లో రైళ్ళు ప‌రిగెత్తించే గంగ‌వ్వ.. ఇంటి స‌భ్యుల‌తో ఫుల్ కామెడీ చేస్తుంద‌ని భావించిన నిర్వాహ‌కులు ఆమెని ఎంపిక చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌ర‌గుతుంది. 
 
కానీ గ‌త మూడు సీజ‌న్‌లు చూస్తే ఇంత వయ‌స్సు ఉన్న కంటెస్టెంట్స్ ఎవ‌రిని ఎంపిక చేయ‌లేదు. మ‌రి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌లో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగ‌క త‌ప్ప‌దు 
 
కాగా మంచి పాపులారిటీ ఉన్న గంగవ్వ గతంలో పలు చిత్రాల్లో కూడా నటించింది. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కాజ‌ల్ వంటి స్టార్స్‌తో ముచ్చ‌టించింది. అనేక మంది ప్ర‌శంస‌లు కూడా పొందింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం గంగ‌వ్వ‌కు బిగ్ బాస్ నుండి పిలుపు వ‌చ్చింద‌నే వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments