Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గ్యాంగ్ లీడర్‌'' రీమేక్‌లో ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లోని పాటలు మెగా వారసుడైన రామ్ చరణ్‌తో పాటు మెగా హీరోలు వాడుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా చిన్నల్లుడు కల్యాణ్ కూడా మెగాస్టార్ సినిమా టైటిల్ విజేతను వాడుకున్న

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (15:00 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లోని పాటలు మెగా వారసుడైన రామ్ చరణ్‌తో పాటు మెగా హీరోలు వాడుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా చిన్నల్లుడు కల్యాణ్ కూడా మెగాస్టార్ సినిమా టైటిల్ విజేతను వాడుకున్నాడు. ఈ నేపథ్యంలో రంగస్థలంతో హిట్ కొట్టిన రామ్ చరణ్.. చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ''గ్యాంగ్ లీడర్‌'' రీమేక్‌లో నటించనున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
 
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో.. విజయబాపినీడు దర్శకత్వంలో 1991లో రిలీజైన సంగతి తెలిసిందే. బప్పీలహరి సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అలాంటి సినిమాను చెర్రీ రీమేక్ చేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. చెర్రీ రీమేక్ చేసే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇక మెగాస్టార్ చిరంజీవి ఓ వేదికపై మాట్లాడుతూ.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై చరణ్ సినిమా ఉంటుందని చెప్పడంతో.. అది కచ్చితంగా గ్యాంగ్‌లీడర్ రీమేకేననే ప్రచారం ఊపందుకుంది. రాజమౌళి మల్టీస్టారర్ తరువాత చరణ్ చేయనున్న ప్రాజెక్టు ఇదేనని సినీ జనం చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments