Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైల‌మాలో గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌

Webdunia
శనివారం, 15 మే 2021 (18:56 IST)
Ghani working still
సినిమా సాఫీగా సాగాలంటే ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య అవ‌గాహ‌న వుండాలి. సినిమా బాష‌లో వీరిద్ద‌రూ భార్య‌భ‌ర్త‌లు లాంటివార‌ని నానుడి. క‌నుక సినిమా మేకింగ్‌లో ద‌ర్శ‌కుడు కావాల్సిన మేర‌కు స్వాతంత్రం వుండాలంటారు. అదిలేక‌పోతే సినిమా గాడిత‌ప్పుతుంది. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న `గ‌ని` సినిమాకు అదే జ‌రిగింది. కిరణ్ కొర్రపాటి రచన, దర్శకత్వం వహించారు  సిధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ క‌రోనా కంటే ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల వ‌ల్ల ఆగిపోయింది.
 
స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా క‌నుక ఇందుకు సంబంధించిన బాక్సింగ్ కోర్టును 50 ల‌క్ష‌ల‌తో భారీ సెట్ వేశారు. కానీ అక్క‌డ షూట్ చేయ‌లేక‌పోయారు. కార‌ణం నిర్మాత‌ల్లో ఒక‌రు త‌ప్పుకోవ‌డ‌మే. దాంతో సాఫీగా సాగాల్సిన షూటింగ్ అర్థంత‌రంగా ఆగిపోయింది. దీని గురించి ఏమి చేయాలో గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ (వ‌రుణ్ తేజ్‌)కు అర్థం కాక స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికితోడు వ‌రుణ్‌తేజ్ క‌థ విష‌యంలో సంతృప్తిక‌రంగా లేడ‌నీ కొంత మార్పుచేయాల‌ని సూచ‌న చేశాడ‌ట‌. ముందు క‌థంతా విని సెట్‌పైకి వెళ్ళి కొంత భాగం షూట్ చేశాక ఈ ప‌రిణామాలు జ‌ర‌గ‌డంతో ద‌ర్శ‌కుడు త‌న వ‌ల్ల‌కాద‌ని చేతులెత్తేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
పైగా ఈ బాక్సింగ్ సెట్ లో భారీగా జూనియ‌ర్ ఆర్టిస్టులుకూడా కావాల్సి వుంటుంది. బాక్సింగ్‌ను సీన్స్ చేయ‌డానికి పారిస్ పైట‌ర్లుకూడా ప్ర‌స్తుతం అందుబాటులో లేర‌ని స‌మాచారం. అందుకే గ‌ద్ద‌ల‌కొండ‌కు ఏమి చేయాలో అర్థంకాక దేవుడిపైనే భారం వేశాడు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలో వ‌రుణ్‌తేజ్‌పై ఓ సాంగ్ వుంటుంది. `చంద్రునికైనా లేదా మ‌చ్చ‌, నే కాలుపెడితే ర‌చ్చ‌..`అంటూ ప‌ల్ల‌వితోసాగుతుంది. మ‌రి ఈసినిమా ఆయ‌న‌కు మ‌చ్చ‌గా నిలిచిపోతుందో లేదో కాల‌మే స‌మాధానం చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments