Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాల్లో పవన్ కళ్యాణ్.. డబ్బుల్లేక బెంజ్ కారును అమ్మేసిన గబ్బర్ సింగ్!

టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారా? అందుకే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన మెర్సిడెజ్ బెంజ్ కారును అమ్మేశారా? ఇపుడు ఇదే అంశంపై ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ మారింద

Webdunia
గురువారం, 28 జులై 2016 (12:10 IST)
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారా? అందుకే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన మెర్సిడెజ్ బెంజ్ కారును అమ్మేశారా? ఇపుడు ఇదే అంశంపై ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ మారింది. 
 
గత కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులతో పాటు 'సర్దార్ గబ్బర్ సింగ్' నిర్మాణంలో పాలుపంచుకోవడం, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో తాత్కాలికంగా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు తానెంతో ఇష్టపడి కొనుక్కున్న మెర్సిడిస్ బెంజ్ జీ 55 కారును విక్రయించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి. 
 
దీని విలువ దాదాపు రూ.2 కోట్లు కాగా, మరో కారును కొనాలని ఆయన భావించి ఉంటే, ఆ పని చేసిన తర్వాతే దీన్ని విక్రయించేవారని, పవన్ కారు కొనలేదు కాబట్టి ఇబ్బందుల వల్లే దీన్ని అమ్మేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌ తేజ్‌ వివాహం సమయంలో చెర్రీని పవన్ కళ్యాణ్ ఇదే కారులో ఎక్కించుకుని కళ్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments