అరె. గప్‌చుప్‌గా కూర్చోవయ్యా.... ఒకే ఒక్క సినిమా.. అందం లేకున్నా హావభావాలతోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సాయి పల్లవి. ఈ మలయాళ భామ నటించింది మూడు సినిమాలే అయినా పేరు ప్రఖ్యాతులు మాత్రం బాగానే సంపాదించుకుంది. సాయిపల్లవిని అభిమానించే వారికన్నా ప్రే
అరె. గప్‌చుప్‌గా కూర్చోవయ్యా.... ఒకే ఒక్క సినిమా.. అందం లేకున్నా హావభావాలతోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సాయి పల్లవి. ఈ మలయాళ భామ నటించింది మూడు సినిమాలే అయినా పేరు ప్రఖ్యాతులు మాత్రం బాగానే సంపాదించుకుంది. సాయిపల్లవిని అభిమానించే వారికన్నా ప్రేమించే వారే ప్రస్తుతం ఎక్కువగా ఉన్నారు. తెలుగులో నటించిన ఫిదా సినిమాలో మేకప్ లేకుండా నటించిన ఈ మలయాళ భామ ప్రేక్షకులను ఎంతగానో నచ్చేలా చేసింది.
అలాంటి సాయిపల్లవి ప్రేమలో పడిందట. అది కూడా ఫిదా హీరోతో. ఆయనేనండి వరుణ్ తేజ్. మొదట్లో వరుణ్ భారీ ఆకారంతో సినిమాల్లో నటించారు. ఫిదా సినిమాలో స్లిమ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్యారెక్టర్ తగ్గట్టు తన శరీరాన్ని మార్చుకున్నారు వరుణ్. ఫిదా సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, సినిమా హిట్టయిన తరువాత ప్రస్తుతం ప్రేక్షకులను కలిసేందుకు వెళుతున్న సమయంలో వీరు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండడం లేదని ఆ సినిమా టీమే చెవులు కొరుక్కుంటోంది.
సినీనటుల మధ్య చిగురించే ప్రేమలు గురించి తెలిసిందే. వీరిది గాఢ ప్రేమా... లేకుంటే అట్రాక్షనా... లేకుంటే సినీ ప్రేమా... అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. గతంలో కూడా ఇలాంటి ప్రేమలు పుట్టడం మధ్యలోనే విడిపోవడం ఎన్నో చూశాం. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలాంటిదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.