Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఫిదా' ధాటికి 'గౌతమీపుత్ర శాతకర్ణి' రికార్డులు గల్లంతు!

మెగాహీరో వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఫిదా". ఈ చిత్రం ఎవరూ ఊహించని విధింగా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు తెలుగు ర

Webdunia
సోమవారం, 31 జులై 2017 (17:10 IST)
మెగాహీరో వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఫిదా". ఈ చిత్రం ఎవరూ ఊహించని విధింగా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అద్భుతంగా సత్తా చాటుతోంది. ముఖ్యంగా... ఓవర్సీస్‌లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఏకంగా మూడో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచేందుకు మరెంతో దూరంలో లేదు. రెండో వారం ముగిసే సమయానికి ఈ సినిమా 1.62 మిలియన్‌ డాలర్లు (దాదాపు 11 కోట్ల రూపాయలు) కొల్లగొట్టినట్టు సినీ ట్రేడ్ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫుల్‌‌రన్‌లో 1.66 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లు సాధించింది. దీంతో అతి త్వరలోనే 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను 'ఫిదా' దాటేయనుంది. కాగా, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా 'బాహుబలి-2', 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలు 'ఫిదా' కంటే ముందున్నాయి. దీంతో ఓవర్సీస్ కలెక్షన్లలో టాప్-3లో ఫిదా చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఆస్తులు విలువెంతంటే?

Chandrayaan-5: చంద్రయాన్-5 కోసం కుదిరిన డీల్.. జపాన్‌తో కలిసి పనిచేస్తాం.. నరేంద్ర మోదీ

తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడానికి సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి వుంది.. కందుల దుర్గేష్

సెక్యూరిటీ గార్డు వేతనం నెలకు రూ.10 వేలు.. రూ.3.14 కోట్లకు జీఎస్టీ నోటీసు

గోదావరి నదికి చేరుతున్న వరద నీరు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments