Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులోనే నాగచైతన్య-సమంత పెళ్ళి.. అతిథుల లిస్టు కూడా రెడీ..?

సమంత-నాగచైతన్యల ప్రేమ వివాహంపైనే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. వీరిద్దరి వివాహంపైనే ప్రస్తుతం అందరి కన్నుపడింది. పెళ్లికి ముందు రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్ టాక్ సంపాదించడంతో నాగచైతన్య త

Webdunia
శనివారం, 27 మే 2017 (17:30 IST)
సమంత-నాగచైతన్యల ప్రేమ వివాహంపైనే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. వీరిద్దరి వివాహంపైనే ప్రస్తుతం అందరి కన్నుపడింది. పెళ్లికి ముందు రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్ టాక్ సంపాదించడంతో నాగచైతన్య తెగ ఖుషీలో ఉన్నాడు. అంతేగాకుండా సమంతతో తన వివాహంపై అందరి దృష్టి  వుందనే విషయాన్ని గమనిస్తున్నట్లు చైతూ తెలిపాడు. ప్రేమతో పాటు వివాహ బంధంతో ఏకమవుతున్న తాము.. తమ జీవితంలోని ప్రతి ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పాడు.
 
కాగా.. ఏం మాయ చేశావేతో నాగచైతన్య, సమంత ఒక్కటయ్యారు. రీల్ లైఫ్ లోనూ.. రియల్ లైఫులో కూడా ప్రేమలో మునిగి తేలారు.. "మనం" సినిమాలో అక్కినేని కుటుంబంలో కలిసిపోయారు. ప్రస్తుతం రియల్ లైఫ్‌లోనూ ఏకం కానున్నారు. 
 
ఈ మధ్య సమంత పుట్టినరోజు వేడుకలు కూడా నాగ చైతన్యతో కలిసి వారి ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంది. ఈ నేపథ్యంలో సమంత-చైతూల పెళ్లి ఎక్కడ జరుగుతుందనే విషయంపై చర్చ సాగుతోంది. కాగా హైదరాబాదులోనే అంగరంగ వైభవంగా సమ్మూ-చైతూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అతిథుల లిస్ట్ కూడా సిద్ధం చేశారు. త్వరలోనే పెళ్లి భాజాలు మోగించేందుకు సిద్ధమవుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

AP Cabinet: మే 20న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త... అమ్మాయితో అశ్లీల వీడియో

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments