Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ స్నేహబంధం

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడికి వెళ్లినా త్రివిక్రమ్‌ అక్కడుంటాడు. పెళ్లిళ్ళకీ, ఫంక్షన్లకీ పవన్‌, త్రివిక్రమ్‌ జంటగానే వెళుతుంటారు. ప

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (12:50 IST)
పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడికి వెళ్లినా త్రివిక్రమ్‌ అక్కడుంటాడు. పెళ్లిళ్ళకీ, ఫంక్షన్లకీ పవన్‌, త్రివిక్రమ్‌ జంటగానే వెళుతుంటారు. పవన్‌ పక్కన త్రివిక్రమ్‌ కనిపించకపోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. పవన్‌తో ఉన్న స్నేహం కారణంగానే త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని అతనితోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే త్రివిక్రమ్‌ కోసమే ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మాణంలో చేయడానికి పవన్‌ అంగీకరించాడు. అయితే ఈమధ్య తీరిక ఎక్కువ దొరికిందో ఏమో కానీ పవన్‌కళ్యాణ్‌ సొంత కథలు రాసుకుంటున్నాడు. 
 
ఈ కారణంగా వేరే వాళ్లు తనకి ఎలాంటి కథలు చెప్పినా కానీ నచ్చడం లేదు. ఇదిలావుంటే... ''సర్దార్ గబ్బర్ సింగ్'' పరాజయం తర్వాత త్రివిక్రమ్‌తో పవన్ సినిమా చేస్తాడని అందరూ భావించారు. అందరికీ షాక్ ఇస్తూ మరో డైరెక్టర్ చేతిలో పవన్ తన తర్వాతి సినిమా (కాటమరాయుడు)లో నటిస్తున్నారు. కాటమరాయుడు తర్వాత పవన్ చేయబోయేది త్రివిక్రమ్‌తోనేనని, దానికి కథ కూడా పవన్‌దే అనీ, కాటమరాయుడు పూర్తయ్యేలోపు పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసుకొని సినిమా ప్రారంభించాలనీ, త్రివిక్రమ్ ఆ పనిమీదే తీరిక లేకుండా ఉన్నాడని టాలీవుడ్ ప్రచారం జోరుగా సాగింది. 
 
అయితే, ఆ వార్తలకు సైతం చెక్ పెడుతూ తమిళంలో ''వేళాయుధం'', ''జిల్లా'' వంటి చిత్రాలకు పనిచేసిన ఆర్‌టీ నేశన్‌కు తన తరువాతి సినిమా బాధ్యలను అప్పగించాడు పవర్ స్టార్. త్రివిక్రమ్‌కు పవన్‌కు చెడిందని అందువల్లే త్రివిక్రమ్‌ని పవన్ కావాలనే పక్కన పెట్టాడని టాలీవుడ్‌లో జనాలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, కాటమరాయుడు, నిశాన్ సినిమాల తర్వాత కూడా ఈ కాంబినేషన్‌లో సినిమా ఉండకపోవచ్చనేది టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments