నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ కెరీర్‌లో మరో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. అతని తదుపరి ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. మెగా హీరోల దర్శకుడు బాబీ తొలిసారిగా బాలయ్యకు దర్శకత్వం వహిస్తున్నారు.
బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ చిత్రం. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని చిత్రబృందం ఓ అప్‌డేట్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ స్ప్రెడ్ అయింది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం మొదలైంది.
అలాగే మల్టీస్టారర్ చిత్రాలకు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త కూడా వైరల్ అవుతోంది. అయితే బాబీ-బాలయ్య సినిమాలో దుల్కర్ నటిస్తున్నారనే వార్తలపై అధికారిక సమాచారం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.