Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ 150వ చిత్రంలో పంజాబీ సింగర్.. మ్యూజికల్ హిట్ కోసం డీఎస్పీ తంటాలు

చిరంజీవి 150 వ చిత్ర టైటిల్‌ను నిర్మాత, హీరో రామ్ చరణ్ ఖరారు చేసింది. చిరంజీవి 150 వ చిత్రం పేరు 'ఖైదీ నెంబర్ 150' గా ఖరారు చేశారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి వి.వి.వినాయక్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (12:23 IST)
చిరంజీవి 150 వ చిత్ర టైటిల్‌ను నిర్మాత, హీరో రామ్ చరణ్ ఖరారు చేసింది. చిరంజీవి 150 వ చిత్రం పేరు 'ఖైదీ నెంబర్ 150' గా ఖరారు చేశారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఆయనకే కాదు, ఆ చిత్రానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. అందుకే, ఎవరికి వారు తమ సత్తా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన దైన శైలిలో ఈ చిత్రానికి సంగీతాన్నిఅందిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ పేరు వినగానే ఎనర్జిటిక్ పాటలు గుర్తొస్తాయి. కేవలం గుర్తుకు రావడమే కాదు దేవి పాటలు వింటే ఎవ్వరైనా డాన్స్ వేసేయ్యాల్సిందే. 
 
ముఖ్యంగా దేవి ఐటెం సాంగ్ అంటే చెవులు కోసుకునే వారు కుడా వున్నారనే చెప్పాలి. ఎన్నో మాస్ సినిమాలకు దేవి పాటలు ఆర్ ఆర్ ప్లస్ అయ్యాయనే చెప్పాలి. అంతేకాదు దేవి సంగీతం అంటే సినిమాకు ముందే సగం విజయం కూడా అందుకున్నట్లే. చిరంజీవి సినిమా అంటే మ్యూజికల్ హిట్‌గా ఉండాలి కాబట్టి క్యాచీ నంబర్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉత్తరాదికి చెందిన పేరున్న సింగర్స్ చేత పాడిస్తున్నాడు. అలాగే ప్రముఖ పంజాబీ సింగర్ జాస్మిన్ సాండ్లాస్ చేత కూడా తాజాగా ఓ పాట పాడించాడు. 
 
ఈ విషయాన్నిసింగర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 'మెగాస్టార్ సినిమా కోసం డీఎస్పీ వద్ద నా తొలి తెలుగు సాంగును రికార్డు చేశాను. చాలా అదృష్టవంతురాలిని' అంటూ ట్వీట్ చేయడమే కాకుండా, దేవిశ్రీతో కలసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది. జాస్మిన్ పలు ఆల్బమ్స్ తో పాప్యులర్ కావడమే కాకుండా, పలు హిందీ సినిమాలలో కూడా పాడుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ స్వయగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments