Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా కలెక్షన్లపై తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వను : దిల్ రాజు

మెగా అభిమానులకు, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వుడ జగన్నాథమ్". ఈ చిత్రం గత

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (15:52 IST)
మెగా అభిమానులకు, ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "దువ్వుడ జగన్నాథమ్". ఈ చిత్రం గత నెల 24వ తేదీన విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టింది. 
 
అయితే, ఈ చిత్రం కలెక్షన్లు మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150"ను దాటిపోయిందనే ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహించిన చిరంజీవి ఫ్యాన్స్ డీజే కార్యాలయంపై దాడికి దిగారు. ఈ ఘటన ఫిల్మ్ నగర్‌లో సంచలనం సృష్టించింది. దీనిపై దిల్ రాజు స్పందించారు. 
 
అల్లు అర్జున్ కెరీర్‌‌లో 'సరైనోడు' చిత్రం కలెక్షన్లే ఇప్పటివరకూ అధికమని, దాన్ని దాటిన తర్వాతనే 'డీజే-దువ్వాడ జగన్నాథం' చిత్రం హిట్ అని తాను ప్రకటించానని చెప్పారు. అలాగే, తాను ఎన్నడూ తప్పుడు మాటలు చెప్పలేదని, రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.
 
తమది నమ్మకమైన బ్యానర్ అని, అటువంటి సంస్థ ఓ చిత్రాన్ని హిట్ అని చెప్పిన తర్వాత తప్పులు వెతకడం ఎందుకని ప్రశ్నించారు. ఓ హీరోకు ఇటువంటి సమస్య వస్తే, ఆ హీరో అభిమానుల నుంచి మరో హీరో చిత్రం వచ్చినప్పుడూ ఇదే సమస్య వస్తుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ తరహా విష సంస్కృతిని పెంచకుండా హీరోలు తమ తమ అభిమానులను కట్టడి చేయాలని ఆయన కోరారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments