టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి ఎగుమతి అయిన భామ దిశా పటానీ. తెలుగులో మెగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం "లోఫర్". ఈ చిత్రం ద్వారా దిశా పటానీ తెలుగు వెండితెరకు పరిచయమైంది.
ఈ చిత్రంలో దిశా తన అందచందాలతో ప్రేక్షకులని అలరించిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో అమ్మడికి ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. దీంతో వెంటనే బాలీవుడ్ ఫ్లైటెక్కింది. అక్కడ సల్మాన్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కరోనా వలన ఏడు నెలల పాటు ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా మాల్దీవులకి వెళ్లింది.
భూతల స్వర్గం మాల్దీవులలో దిశా బికినీలో రెచ్చిపోయింది. పరువాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది. దిశా అందాలకు నెటిజన్స్ దాసోహం అయ్యారు. తాజాగా మాల్దీవులకి సంబంధించి మరో ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఇందులోనూ బికినీతో కనిపిస్తున్న దిశా ఆక్వామెన్ స్టైల్‌లో కనిపిస్తుంది. ఈ ఫొటో కూడా నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ చిత్రం ఆక్వామెన్‌ని ప్రముఖ దర్శకుడు జేమ్స్ వాన్ తెరకెక్కించారు.
ఈ దృశ్య కావ్యాన్ని.. డీసి కామిక్స్, వార్నర్ బ్రదర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భూమిపైన, నీటిలోనూ అద్భుతమైన యాక్షన్ హంగామాను ప్రేక్షకులకు రుచి చూపించారు.