Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి "ఖైదీ" సూపర్ హిట్‌తో నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కనకవర్షం కురిపిస్తూ.. రికార్డులు కుమ్మేస్తోంది. ఫలితంగా ఈ చిత్రం నిర్మాతత

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (06:24 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కనకవర్షం కురిపిస్తూ.. రికార్డులు కుమ్మేస్తోంది. ఫలితంగా ఈ చిత్రం నిర్మాతతో పాటు.. మెగా ఫ్యామిలీ చాలా సంతోషంలో ఉంది. కానీ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం దుఃఖంలో మునిగిపోయారు. దీనికి కారణం ఖైదీ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడమే. దీనివల్ల ఆయన భారీ నష్టాలను మూటగట్టుకోనున్నారు. ఏంటీ.. సినిమా హిట్ అయితే.. లాభాలే కదా వస్తాయి.. నష్టాల్లో ఎందుకు కూరుకుంటారనే కదా మీ సందేహం.. అయితే, ఈ కథనం చదవండి. 
 
సంక్రాంతి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. దాదాపు 9 యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా.. మెగాస్టార్‌లో ఆ జోరు.. ఆ ఊపు.. ఆ గ్రేసు ఏమాత్రం తగ్గలేదని అభిమానులు కితాబిస్తున్నారు. మెగా ఖైదీపై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హిట్ టాక్‌ని సొంతం చేసుకొన్న మెగా ఖైదీ థియేటర్స్ పెంచేందుకు చిత్రబృందం ట్రై చేస్తోంది. పైగా థియేటర్స్ సంఖ్యను పెంచడం అటుంచి ప్రస్తుతం ఆడుతున్న థియేటర్స్ నుంచి మెగా ఖైదీని తీసేసేందుకు అస్సలు ఇష్టపడటం లేదు.
 
ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా ఈనెల 14న రిలీజ్ కానున్న దిల్ రాజు 'శతమానం భవతి' కోసం బుక్ చేసుకొన్న థియేటర్స్‌లో మెగా ఖైదీని తీసేసేందుకు చిత్రబృందం ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో దాదాపు 200 థియేటర్స్‌ని దిల్ రాజు వదులుకోవాల్సి వస్తుందట. దీంతో తన సొంత చిత్రం శతమానం భవతిని అతి తక్కువ థియేటర్లలోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇందుకు దిల్ రాజు అంగీకరించక పోవడంతో రంగంలోకి దిగిన మరో నిర్మాత అల్లు అరవింద్ డీల్ సెట్ చేస్తున్నాడంట. అయితే, మొత్తంగా చూస్తే మెగా ఖైదీ కారణంగా దిల్ రాజు పంపిణీదారుడిగా కాస్తో.. కూస్తో లాభాలు చవిచూసే ఛాన్స్ ఉంది. కానీ, సొంతం చిత్రం ద్వారా లాభాలు చవిచూడలేక... నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ నష్టాన్ని భవిష్యత్‌లో ఏ రకంగానైనా ఫిల్ చేస్తామని మెగా కాంపౌండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Achchennaidu: వచ్చింది పది నిమిషాలే.. జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

ప్రతిపక్ష హోదా కావాలా? జర్మనీకి వెళ్లండి జగన్: డిప్యూటీ సీఎం పవన్ పంచ్

వాళ్లు ప్రతిపక్ష హోదా ఇవ్వరు... సో.. అసెంబ్లీకి వెళ్లొద్దు : జగన్ నిర్ణయం

Amaravati : మార్చి 15న అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం

జగన్‌కు ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్ : అది రాదని మానసికంగా ఫిక్స్ అయిపోండంటూ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments