Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌ల్మాన్, ర‌ణ‌వీర్‌ల క్రేజీ కాంబినేషన్‌తో 'ధూమ్-4'

Webdunia
బుధవారం, 18 మే 2016 (12:53 IST)
బాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ ''ధూమ్''. మొదటి భాగంలో జాన్ అబ్రహాం నటించి సంచలనం సృష్టించాడు. రెండో భాగంలో హృతిక్ రోషన్ నటించిన ధూమ్ - 2 కూడా బాక్సాఫీసులో రికార్డుల మోత మోగించింది. ఆ తర్వాత మూడో భాగంలో అమీర్ ఖాన్ ''ధూమ్-3'' లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో మూడు సినిమాలొచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు నాలుగో భాగం రంగంలోకి దిగడానికి సిద్ధమవుతోంది. 
 
ఒకదాన్ని మించిన మరొకటి భారీ విజయం నమోదు చేసుకుంటూ వస్తున్న ''ధూమ్‌'' సిరీస్‌లో నాలుగో సినిమాకు మరింత క్రేజీ కాంబినేషన్ దొరికింది. హీరో కంటే విలన్‌కి ఎక్కువ ముఖ్యత్వం ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాలో ఈ సారి విలన్ పాత్రను సల్మాన్‌ఖాన్ పోషించనున్నాడు. ఇప్పటివరకూ మూడు సినిమాల్లో పోలీసాఫీసర్‌గా హీరో పాత్రను అభిషేక్‌ బచ్చన్ పోషించాడు. అయితే అతనితో పాటు, అతనికి అసిస్టెంట్‌గా ఉదయ్‌ చోప్రా నటించాడు. క్రేజీ దొంగ‌త‌నాలు చేసే ప్ర‌తినాయ‌కునిగా స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తుండ‌గా, స‌ల్మాన్‌తో పోటీ ప‌డి ప‌ట్టుకోబోయే పోలీస్ పాత్ర‌ను ర‌ణ‌వీర్ సింగ్ చేయనున్నాడు.
 
విలన్ జోడీగా ఇప్పటివరకు మూడు సినిమాల్లో వరుసగా ఇషా డియోల్‌, ఐశ్వర్యా రాయ్‌, కత్రినా కైఫ్‌ నటించగా, ఇప్పుడు సల్మాన్ జోడీ కోసం దర్శకుడు వెతుకులాట మొదలుపెట్టాడు.''ధూమ్‌ రీలోడెడ్‌: ద చేజ్‌ కంటిన్యూస్‌'' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిపోగా మిగిలిన తారల ఎంపిక కూడా పూర్తిచేసి జ‌న‌వ‌రి 2017 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయ‌బోతున్నారు. 'ధూమ్ 4'లో స‌ల్మాన్, ర‌ణ‌వీర్‌ల క్రేజీ కాంబినేషన్‌తో కూడిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments