Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరేశన్ దంపతుల అసలు బిడ్డ దొరికాడట.. హీరో ధనుష్‌కు ఊరట.. ఏప్రిల్ 11న తుదితీర్పు?

కోలీవుడ్ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు పేరెంటిటీ కేసులో కాస్త ఊరట లభించినట్లు తెలుస్తోంది. శివగంగైకి చెందిన కదిరేశన్ (65), మీనాక్షి (53) దంపతులు సినీ హీరో ధనుష్ తన కుమారుడేనని.. క

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (17:39 IST)
కోలీవుడ్ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు పేరెంటిటీ కేసులో కాస్త ఊరట లభించినట్లు తెలుస్తోంది. శివగంగైకి చెందిన కదిరేశన్ (65), మీనాక్షి (53) దంపతులు సినీ హీరో ధనుష్ తన కుమారుడేనని.. కోర్టులో న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

ధనుష్ శివగంగై నుంచి చెన్నైకి చిన్నప్పుడు పారిపోయి వచ్చేశాడని.. ప్రస్తుతం హీరోగా ఉన్న ఆయన తల్లిదండ్రులైన తమకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా చేయాలని వృద్ధ దంపతులు కోర్టును కోరారు. దీంతో కొలవెరి సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పేరు కొట్టేసిన ధనుష్‌‌కు తల్లిదండ్రులు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో మధురై కోర్టులో హాజరైన ధనుష్‌కు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ మెడికల్ రిపోర్టులో ధనుష్ లేజర్ ద్వారా మచ్చలను తొలగించినట్లు తేలింది. ఫలితంగా ధనుష్ కదిరేశన్ దంపతులకు జన్మించిన బిడ్డేనని వచ్చిన ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 
 
చిన్నతనంలో తమ ఇంటి నుంచి పారిపోయిన తమ కుమారుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడని కదిరేశన్ దంపతులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తద్వారా ధనుష్‌కు ఈ కేసు నుంచి విముక్తి లభించినట్లేనని సినీ పండితులు అంటున్నారు. 
 
అయినప్పటికీ ఇంకా కోర్టు తీర్పు వెలువరించని కారణంగా.. ఏప్రిల్ 11 (మంగళవారం) ఈ కేసు తుది విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ధనుష్ పుట్టుమచ్చలు, డీఎన్ఏ టెస్టుపై విచారణ జరుగవచ్చునని తెలుస్తోంది. ఈ విచారణకు అనంతరమే కోర్టు తీర్పునివ్వనుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments