Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్‌ చిత్రంలో నటించడం ప్రత్యేక అనుభూతినిచ్చింది : దీపికా పదుకొణె

దీపికా పదుకొణె నటించిన హాలీవుడ్‌ చిత్రం ''ట్రిప్లెక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్'' ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. దీని గురించి దీపికా స్పందించింది. ''ప్రపంచం కొత్త టాలెంట్‌ను కోరుకు

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (09:26 IST)
దీపికా పదుకొణె నటించిన హాలీవుడ్‌ చిత్రం ''ట్రిప్లెక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్'' ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. దీని గురించి దీపికా స్పందించింది. ''ప్రపంచం కొత్త టాలెంట్‌ను కోరుకుంటోంది. సినిమాలోని ఓ పాత్రకు ఫలానా నటుడు లేదా నటి సరిపోతారో లేదో చూస్తున్నారంతే. అందుకే మంచి నటులు వెండితెరకొస్తున్నారు'' అని చెప్పింది. తన హాలీవుడ్‌ ప్రయాణం అంత సులువుగా ఏమీ మొదలుకాలేదని చెబుతోంది దీపిక. 


''ఇదే నా తొలి హాలీవుడ్‌ పిలుపు కాదు... దీనికంటే ముందే రెండు మూడు అవకాశాలు వచ్చాయి. కానీ అవేవీ నాకు సరిపోవనిపించింది. అందుకే వదిలేశాను. ఎంత మంచి ప్రాజెక్టు అయినా నా మనసు అంగీకరిస్తేనే ఒప్పుకుంటాను. లేదంటే నిర్మొహమాటంగా నటించనని చెప్పేస్తాను. నేను నటించే పాత్ర ముందు నాలో ఆత్రుత కలిగించాలి. లేదంటే పాత్రలో నటించినా పెద్దగా ఉపయోగం ఉండదు'' అని చెప్పింది దీపికా పదుకొణె. 
 
అంతేకాదు.. హాలీవుడ్‌లో నటించేందుకు చాలా భయపడిందట దీపిక. ఇప్పుడు మాత్రం ఇది హాలీవుడ్‌ చిత్రం అయినప్పటికీ భారతీయ సినిమా చూసినట్టే ఉంటుందని ఆనందం వ్యక్తంచేసింది. ఈ సినిమాలో నటించేందుకు హాలీవుడ్‌ వెళ్లిన తొలినాళ్లలో చాలా చాలా భయపడ్డాను. అక్కడి వాతావరణం కొత్త. నటీనటులతో గానీ.. చిత్ర బృందంతోగానీ గతంలో కలిసి పనిచేసిన అనుభవం లేదు. కొన్ని రోజుల్లోనే వారితో సాన్నిహిత్యం ఏర్పడింది... వారితో తొందరగా కలిసిపోయా. తర్వాత చాలా సౌకర్యంగా అనిపించింది. ఈ సినిమా నాకు మంచి అనుభూతినిచ్చిందని తన మనసులోని మాటను తెలియజేసింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments