Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

చిత్రాసేన్
శనివారం, 4 అక్టోబరు 2025 (12:07 IST)
Deepika Padukone, Alia Bhatt, Saipallavi
బాలీవుడ్ నటీమణులు ఈమద్య తెలుగు సినిమాల్లోనుంచి బయటకు వచ్చేస్తున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ సినిమాలో ముందుగా దీపికను అనుకొనగా ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ప్రభాస్ తో చేయనని సోషల్ మీడియాలోనే పోస్ట్ పెట్టింది. ఇంకోవైపు కల్కి 2 సినిమాను నాగ్ అశ్విన్ ప్రణాళిక సిద్ధంచేశాడు. కానీ, ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్, స్పిరిట్ తోపాటు సలార్ 2 కూడా పైప్ లైన్ లో వుండడంతో డేట్స్ కుదరక కల్కి 2 వాయిదా పడే సూచనలు కనిప్పించాయి. దాంతో తను ప్లాన్ చేసినట్లు ఆర్టిస్టులు ఎంపిక సెట్ కావడంలేదని తెలుస్తోంది.
 
అందుకే ఈలోగా లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. మహానటి లాగా ఓ బయోపిక్ చేస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. అది ఎవరునేది సస్పెన్స్. దానికోసం ముందుగానే ఆలియా భట్ ను సంప్రదించినట్లు తెలిసింది. కానీ ఆ తర్వాత తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకు వచ్చే ఏడాది లో తన డేట్స్ లేవని మేనేజర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
 
తాజాగా, బాలీవుడ్ లో ఆలియా భట్ బాలీవుడ్ చాముండ చిత్రంలో నటిస్తోంది.అయితే వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. అయినా సరే తనకు డేట్స్ కుదరకపోవచ్చని నాగ్అశ్విన్ కు చెప్పినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. రణబీర్ కపూర్ తో రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మధ్యలో పూర్తికావస్తుందట. అందుకే ఆమె డేట్స్ అయితే బాగుంటుందని తెలుస్తోంది.
 
కాగా, ఒకవైపు దీపికా, మరోవైపు ఆలియా భట్ లు తప్పుకోవడంతో ఇండియన్ మార్కెట్ రీత్యా ఫేమస్ అయిన నటీమణుల్లో సాయి పల్లవి బెటర్ అనే టాక్ వుంది. కానీ లేడీ ఓరియెంటె్ పాత్రలో ఆమె సరిపోతుందో లేదో అని తన దర్శక సంఘం టీమ్ తో నాగ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలీవుడ్ నటీమణులతో సినిమాలు తీయడం కష్టంతోపాటు రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా వుండడంతో హీరోయిన్లను మార్చేస్తున్నారనే వార్త వినిపిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. బస్సును నడుపుతూ కుప్పకూలిపోయాడు..

తెలంగాణలో అత్యధికంగా వరకట్న హత్యలు.. ఏడింటింలో మూడు హైదరాబాదులోనే

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments