Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు చూపిస్తేనే నీకు ఛాన్స్ - బొద్దుగుమ్మకు డైరెక్టర్ల సలహా...

అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టింది మలయాళ భామ నిత్యామీనన్. ముద్దుగా..బొద్దుగా ఉండే నిత్యామీనన్ మొదటగా బాలనటిగా నటించి ఆ తరువాత హీరోయిన్ అయ్యింది. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. నటనలో తనకంటూ

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (19:45 IST)
అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టింది మలయాళ భామ నిత్యామీనన్. ముద్దుగా..బొద్దుగా ఉండే నిత్యామీనన్ మొదటగా బాలనటిగా నటించి ఆ తరువాత హీరోయిన్ అయ్యింది. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. నటనలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న హీరోయిన్ నిత్య. అంతే కాదు సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
 
అలాంటి నిత్యామీనన్ హవా రోజురోజుకు తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆమె పరిస్థితి చాలా దారుణంగా తయారైందని సినీవర్గాలు చెబుతున్నాయి. నిత్యామీనన్ కెరీర్ అర్థాంతరంగా ఆగిపోవడానికి ఆమెకు తగిన పాత్రలు లేకపోవడమేనట. తనకు సూటయ్యే పాత్రలు తప్ప అస్సలు ఎక్స్‌పోజింగ్ చేయనని చెప్పడమే నిత్యకు పెద్ద మైనస్ అట. అందుకే నిత్యామీనన్ అంటే డైరెక్టర్లు అస్సలు ఇంట్రస్ట్ చూపడం లేదట. 
 
కొత్తగా వచ్చిన హీరోయిన్లు అందాలు ఆరబోయడానికి సిద్థంగా ఉంటే నిత్యామీనన్ మాత్రం ఇంకా మూసపద్థతిలో ఉండడం ఆఫర్లు రాకుండా పోతోందని తెలుగు సినీపరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే నిత్యామీనన్‌కు ఇక సినిమాలే రాకుండా పోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments