ద్యావుడా.. కలర్స్ స్వాతి అలాంటి ఆఫర్ ఇచ్చేసిందా...?

ఒకప్పుడు మా టివిలో యాంకర్‌గా ఉన్న స్వాతి మాట్లాడుతుంటే ప్రేక్షకులు రెప్ప కదిలించకుండా చూసేవారు. స్వాతి ఎంతో క్యూట్‌గా కబుర్లు చెప్పేది. ఆ టివి ఛానల్లోని కార్యక్రమం పేరు కలర్స్ అనే పేరు స్వాతి ఇంటి పేరుగా మారిపోయేంతగా స్వాతికి అప్పట్లో పేరు వచ్చింది.

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (14:24 IST)
ఒకప్పుడు మా టివిలో యాంకర్‌గా ఉన్న స్వాతి మాట్లాడుతుంటే ప్రేక్షకులు రెప్ప కదిలించకుండా చూసేవారు. స్వాతి ఎంతో క్యూట్‌గా కబుర్లు చెప్పేది. ఆ టివి ఛానల్లోని కార్యక్రమం పేరు కలర్స్ అనే పేరు స్వాతి ఇంటి పేరుగా మారిపోయేంతగా స్వాతికి అప్పట్లో పేరు వచ్చింది. స్వాతి రష్యాలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి ఇండియా నేవీలో పనిచేసేవారట. స్వాతి బాల్యం ఎక్కువగా విశాఖపట్నంలోనే గడిచింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో చదువుకుంది.
 
అతి చిన్న వయస్సు 17 యేళ్ళలోనే టివి ఛానళ్ళలోకి యాంకర్‌గా స్వాతి అరగేట్రం చేసింది. కలర్స్ కార్యక్రమంతో బుల్లితెరను దున్నేసింది. ఆ తరువాత సినిమాల్లోను స్వాతికి అవకాశాలు వచ్చాయి. మొదట్లో డేంజర్, ఆ తరువాత ఆడవారి మాటలకే అర్థాలే వేరులే అనే సినిమాల్లో నటించింది. అష్టాచెమ్మా సినిమా అయితే స్వాతికి మంచి పేరును తెచ్చిపెట్టింది. స్వామిరారా... కార్తికేయ సినిమాలు బంపర్ హిట్ కొట్టడంతో స్వాతి బంపర్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.
 
కానీ స్వాతి దశ మాత్రం తిరగలేదు. తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నా అవి మధ్యలో ఆగిపోయాయి. రెండు సినిమాలు ఆగిపోవడంతో స్వాతి ఒక్కసారిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం దర్శకులకు ఒక్కటే చెబుతోందట స్వాతి. అవకాశమిస్తే తన అందాలను ఏ స్థాయిలోనైనా ఆరబోయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోందట. మరి దర్శకులు స్వాతికి అవకాశమిస్తారా.. లేదా అన్నది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments