Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ నిజాలు... ఇంటర్నేషనల్ సిమ్‌తో పూరీ చాటింగ్ ‌.. డ్రగ్ సరఫరాకర్త శ్యామ్?

హైదరాబాద్ డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు తక్కువోడేంకాదనీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అంటున్నారు. మత్తుమందు కొనుగో

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (15:01 IST)
హైదరాబాద్ డ్రగ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు తక్కువోడేంకాదనీ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అంటున్నారు. మత్తుమందు కొనుగోలు కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ సిమ్ ఒకదాన్ని వాడుతున్నట్టు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ సిమ్ ద్వారా వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి ఆ గ్రూపు సభ్యుల ద్వారా మత్తుమందును విక్రయిస్తున్నారనే విషయాన్ని నిర్ధారించినట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా పూరీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా గంటల తరబడి చాట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై పూరీని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్న ఈ దర్శకుడు... సిమ్ నంబరుతో పాటు చాట్ వివరాలు చూపించే సరికి తప్పు అంగీకరించినట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి పూరీ జగన్నాథ్ కెల్విన్‌తో గంటల తరబడి చాట్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. 
 
ఆ సిమ్ ద్వారా గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్టు, దాని ద్వారా డ్రగ్స్ అమ్మకాలు సాగించినట్టు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ దందా మొత్తం బట్టబయలైనట్టు సమాచారం. అయితే విదేశాల నుంచి వచ్చే పార్సిల్స్‌ను పూరీకి అందించానే తప్ప, అందులో ఏముందో కూడా తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, పూరీకి డ్రగ్స్ చేరవేసేది శ్యామ్ కె నాయుడేనని సిట్ అధికారులు నిర్ధారించినట్టు సమాచారం. 
 
సిట్ అధికారుల దర్యాప్తులో డ్రగ్స్ దందా పేరుతో తన తండ్రిని బద్నాం చేస్తున్నారంటూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమార్తె ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా చెప్పిన నీతులు, తనకు సిగిరెట్ అలవాటే లేదు... ఇక డ్రగ్స్ అంటే ఏమిటో కూడా రుచి చూడలేదు, అసలు ఎప్పుడూ చూడనే లేదంటూ మీడియా ముందు శ్యామ్ కే నాయుడు చెప్పిన కథలు అంతా అబద్ధాలని తెలిపోయాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments