Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ'ని బందీ చేసిన 'చందమామ' - ఆచార్యకు జోడీ కుదిరింది!

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (09:35 IST)
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య". కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదావేశారు. ఈ చిత్రం షూటింగ్ చాలా మేరకు పూర్తయింది. కానీ, హీరోయిన్ మాత్రం ఎవరన్నది ఇప్పటివరకు ఖరారు కాలేదు. 
 
నిజానికి ఈ చిత్రం కోసం ఎంపిక చేసిన హీరోయిన్ త్రిష.. చిత్ర యూనిట్‌తో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పలువురు హీరోయిన్లను సంప్రదించారట. వారిలో అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్‌తో పాటు మరికొందరు కూడా ఉన్నారు. కానీ, అనుష్క శెట్టి తన బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ ఇవ్వలేక ఈ చిత్రంలో నటించేందుకు నో చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఆ తర్వాత కాజల్ అగర్వాల్ పరిస్థితి కూడా అనుమానంగానే ఉన్నది. ఎందుకంటే.. ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనే వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ అగర్వాల్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. అయితే చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ఇప్పటివరకు హీరోయిన్ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. 
 
ఈ పరిస్థితుల్లో ఓ నెటిజన్ కాజల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రశ్న సంధించాడు. దానికి కాజల్ ఆన్సర్ ఇస్తూ, చిరు సార్ సినిమాలో చేస్తున్నానని, ప్రస్తుతం షూటింగ్ హోల్డ్‌లో ఉండటం వల్ల.. ఇంటి దగ్గరే సినిమా కోసం రెడీ అయ్యేందుకు వర్క్ చేస్తున్నానని తెలిపింది. దీంతో చిరు 152 హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది. కాగా, చిరంజీవి 150వ చిత్రంలోనూ కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments