Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవితో జతకట్టనున్న విజయశాంతి.. 'రాములమ్మ'తో సంప్రదింపులు!

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 150వ చిత్రం 'కత్తిలాంటోండు'. ఈ చిత్రంలో హీరోయిన్‌పై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. హీరోయిన్ల ఎంపికపై ఒక్కో రోజు ఒక్కో కథనం వస్తోంది. అయితే,

Webdunia
బుధవారం, 13 జులై 2016 (12:14 IST)
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 150వ చిత్రం 'కత్తిలాంటోండు'. ఈ చిత్రంలో హీరోయిన్‌పై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. హీరోయిన్ల ఎంపికపై ఒక్కో రోజు ఒక్కో కథనం వస్తోంది. అయితే, తాజాగా ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తున్న వార్త ఒకటి వినడానికి ఆసక్తిగా ఉంది. అందేంటంటే... మెగాస్టార్ సరసన సీనియర్ నటి విజయశాంతి నటించే అవకాశాలు ఉన్నట్టు వస్తున్నాయి. ఇందుకోసం విజయశాంతిని ఆ చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్టు సమాచారం. తన 150వ చిత్రంలో విజయశాంతికి అత్యంత కీలకమైన పాత్ర ఇచ్చేందుకు చిరంజీవి సమ్మతించడంతో ఆమెను చిత్ర యూనట్ వర్గాలు సంప్రదించే పనిలో పడినట్టు వినికిడి.
 
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక చిత్రాలు బంపర్ హిట్ అయ్యాయి. అయితే, ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఒకరిపై ఒకరు అనేక విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకున్నారు. కానీ, చిరంజీవి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా విజయశాంతికి ఓ రోల్ ఇచ్చేందుకు మొగ్గుచూపారు. ఈ వార్త నిజమైతే వెండితెరపై 12 యేళ్ళ తర్వాత చిరంజీవి - విజయశాంతి కాబినేషన్‌ను చూసే భాగ్యం కలగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments