లూసీఫర్ రీమేక్ కోసం రంగంలోకి దిగిన సీనియర్ రైటర్

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (19:42 IST)
మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీని చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి ముందుగా సాహో డైరెక్టర్ సుజిత్ ని ఎంపిక చేసినప్పటికీ... ఆ తర్వాత సుజిత్ ప్లేస్‌లో డైనమిక్ డైరెక్టర్ వినాయక్ వచ్చారు. వినాయక్ తన ఆస్ధాన రచయిత ఆకుల శివతో కలిసి కథలో మార్పులు చేర్పులు చేసారు. చిరంజీవిని కలిసి కథ వినిపించగా... ఆయన సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చెప్పారని.. ప్రస్తుతం వినాయక్ అదే పనిలో ఉన్నారని టాక్ వినిపించింది.
 
అయితే... ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... వినాయక్‌తో పాటు ఆకుల శివ, సాయి మాధవ్ బుర్రా కూడా గత కొన్ని రోజులుగా మార్పులు చేర్పులు చేస్తున్నారట. అయితే... లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... వీరంతా ఇప్పటికే ఒక వెర్షన్‌ను పూర్తి చేశారట. ఆ వెర్షన్‌ను చూసి దానిలోని లోటుపాట్లును వివరించడానికి సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణను రంగంలోకి దింపినట్టు తెలిసింది.
 
ప్రస్తుతం పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్ చదివి తన పాయింట్ ఆఫ్ వ్యూలో కథలో ఉన్న ప్లస్‌లు మైనస్‌లు చెప్పారట. వినాయక్ ఇటీవల కెరీర్లో కాస్త వెనబడ్డారు. అందుచేత ఈ సినిమాతో ఎలాగైనా సరే.. సక్సస్ సాధించాలనే పట్టుదలతో కథపై కసరత్తు చేస్తున్నారట. సాయిమాధవ్ బుర్రా, ఆకుల శివ డైలాగ్ వెర్షన్ రాస్తున్నారట. త్వరలోనే స్ర్కిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసి చిరంజీవికి వినిపించనున్నారని సమాచారం. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి... వినాయక్ ఈ సినిమాతో ఆశించిన విజయం సాధిస్తారని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments