Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జక్కన్న" ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి.. వివివి కూడా వస్తున్నారట.. ఖుషీగా సునీల్!

క‌మెడియ‌న్ స్థాయి నుంచి హీరోగా మారిన క‌థానాయ‌కుడు సునీల్ న‌టించిన‌ తాజా చిత్రం ''జ‌క్క‌న్న''‌. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నారా చోప్రా నటిస్తోంది. ప

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (13:34 IST)
క‌మెడియ‌న్ స్థాయి నుంచి హీరోగా మారిన క‌థానాయ‌కుడు సునీల్ న‌టించిన‌ తాజా చిత్రం ''జ‌క్క‌న్న''‌. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నారా చోప్రా నటిస్తోంది. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్.పి. ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌‌పై నిర్మించారు. ఫ్యామిలీ ఎండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే రిలీజైన టీజర్‌‌కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ''కృష్ణాష్టమి'' పరాజయం తర్వాత సునీల్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
''జ‌క్క‌న్న'' ఆడియో వేడుక హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో ఈనెల 24న జ‌ర‌గ‌నుంది. సునీల్ కోసం ''జ‌క్క‌న్న'' పాట‌ల వేడుక‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌వుతుండ‌టం విశేషం. చిరంజీవితో పాటు 150వ చిత్రం ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ కూడా ఈ ఆడియో ఫంక్షన్‌కి విచ్చేస్తున్నారు. దీనికితోడు చిరు ఆడియో రిలీజ్ చేస్తున్నారు. చిరు 150 సినిమాలో నటించడానికి ఖాళీ లేదన్న నటుడి సినిమా వేడుకకు కూడా చిరంజీవి హాజరవుతుండటం ఇపుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
దీంతో మెగాస్టార్ మనసేమిటో ఇట్టే అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. చిరును అన్నయ్య అని పిలుచుకునే చనువు సునీల్‌కి ఉంది. ఈ అభిమానంతో సునీల్ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. మెగాస్టార్ రాకతో తన సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందన్న ఆనందంలో ఉన్నాడు సునీల్.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments