Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ చిత్రం షూటింగ్ ఆగిపోయింది? ఎందుకో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 150వ చిత్రం షూటింగ్ ఆగిపోయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్‌లో పలు గెటప్స్‌లో చిరంజీవి నటించార

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (12:30 IST)
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 150వ చిత్రం షూటింగ్ ఆగిపోయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్‌లో పలు గెటప్స్‌లో చిరంజీవి నటించారు. చర్లపల్లి జైలులో ఖైదీగా తప్పించుకునే సన్నివేశాలు మూడురోజులనాడు చిత్రీకరించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌రోడ్లపైన.. ఫిలింసిటీలోనూ షూటింగ్ చేశారు.
 
కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. అంటే 15రోజుల పాటు గ్యాప్‌తీసుకుంటున్నారు. కొన్ని సన్నివేశాలను మరింత ఆకర్షణీయంగా తీసేందుకు సిద్ధం చేయమని దర్శకుడు వినాయక్‌కు చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు పరుచూరి బ్రదర్స్‌, బుర్రా సాయిమాధవ్‌ కసరత్తుచేస్తున్నారు. ఇప్పటికే హాస్య సన్నివేశాలు, ఎమోషనల్స్‌ సీన్లు.. మూడు వర్షెన్‌లు వినిపించారు. 
 
ఇంకా ఎక్కడో వెలితిగా ఉందని చిరంజీవి అభిప్రాయపడినట్లు చిత్రయూనిట్‌ తెలియజేస్తుంది. దానికితోడు అలీ నటించే సన్నివేశాలు కూడా కొత్తగా ఉండాలని భావించినట్లు సమాచారం. ఇప్పటికే కొంత పార్ట్‌ను అలీ, చిరంజీవిపై చిత్రించారు. ఇదిలాఉండగా.. చిరంజీవి 15రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments