వైరముత్తును పెళ్లి చేసుకోవాలా.. సారీ నాట్ ఇంట్రెస్టెడ్.. సింగర్ జవాబు (video)

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:36 IST)
గత కొంతకాలంగా భారతదేశంలోని వివిధ సినీ పరిశ్రమలలో మీటూ ఉద్యమం మొదలై ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు బయటకు వస్తున్నాయి. దక్షిణాదిలో మీటూ ఉద్యమం పేరు చెప్పగానే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. కొన్నేళ్ల క్రితం ప్రముఖ తమిళ సినీ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారనే విషయం ఆమె బయట పెట్టారు. 
 
ఈ విషయంలో తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమెకు అంతగా మద్దతు లభించలేదు. పైగా ఎన్నో ఇబ్బందులను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మరికొందరైతే పాపులారిటీ కోసమే ఆమె ఇలాంటి ఎత్తు వేసిందని ఆరోపించారు, అయితే వారికి సైతం చిన్మయి ఘాటుగానే కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు.
 
ఇటీవల తమిళ నిర్మాత కె రాజన్ వైరముత్తు గురించి సానుకూలంగా మాట్లాడిన వీడియోను చిన్మయి షేర్ చేస్తూ, ఇలాంటి వ్యక్తుల వలనే వైరముత్తు లాంటివారు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ఓ నెటిజన్ ట్విట్టర్‌లో చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ‘దీనికి పరిష్కారం ఒకటే. నువ్వు ఆయనను పెళ్లి చేసుకో. కొన్ని రోజులుగా నీ పోరు పడలేకున్నాం. నీకు పనిపాటా లేదా, ఎప్పుడూ ఆయన గురించే మాట్లాడుతున్నావు... నువ్వు బీజేపీ మనిషివి అని మాకు తెలుసు' అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన చిన్మయి ‘సూపర్ ఐడియా, కానీ నాకు ఆసక్తి లేదు' అని జవాబిచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం

Jagan Visits Cyclone areas: కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాను ప్రాంతాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం