Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవితో స్టెప్పులేయనున్న బన్నీ ఐటమ్ గర్ల్.. టాప్ లేచిపోద్ది.. అంటోన్న ఫ్యాన్స్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరు అంటే స్టెప్పులు.. స్టెప్పులు అంటే చిరు.. అలా అభిమానులను తన స్టెప్పులతో మెప్పించిన మెగాస్టార్ అభిమానుల మనసుల్లో

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (10:53 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరు అంటే స్టెప్పులు.. స్టెప్పులు అంటే చిరు.. అలా అభిమానులను తన స్టెప్పులతో మెప్పించిన మెగాస్టార్ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. దాదాపు 8 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిరు తన 150వ మూవీలో డ్యాన్స్ చేస్తాడా అనే సందేహం గతంలో అందరికి కలిగింది. దానికి సమాధానంగా ఆ మధ్య జరిగిన ఓ ఈవెంట్‌లో తన స్టెప్పులతో మెగా అభిమానుల ఆనందాన్ని ఉరకలెత్తించాడు.
 
 ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న ఖైదీ నెంబర్ 150వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా ఇందులో స్పెషల్ సాంగ్ కోసం చిరు సరసన ఎవరిని తీసుకోవాలని యూనిట్ నానా తంటాలు పడ్డ విషయం తెలిసిందే. మొన్నామధ్య తమన్నా చేయనుందని వార్తలు వచ్చిన తాజాగా బన్నీ హీరోయిన్ కేథరిన్ థెస్రా ఫ్రేమ్‌లోకి వచ్చింది. చిరు సినిమాలో స్పెషల్ డ్యాన్స్ కోసం కేథరిన్‌ని తీసుకున్నారు. వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. 
 
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో హాట్ హీరోయిన్ క్యాథెరిన్ థ్రెసాతో ఈనెల 13 నుంచి ఓ పాటను చిత్రీకరించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments