Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిలో శివగామిగా జయప్రద నటించివుంటే ఎలా వుంటుంది?

70టీస్‌లో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రదను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. సినిమాలకు తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద.. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (09:10 IST)
70టీస్‌లో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రదను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. సినిమాలకు తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద.. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సినీ లెజండ్ కమల్ హాసన్ నటించిన దశావతారంలో ఆమె కనిపించారు. దేశంలోని పలు భాషలకు చెందిన సినిమాల్లో నటించిన ఈమె.. మళ్లీ  సినిమాల్లో కనిపించలేదు.
 
ప్రస్తుతం ''కేణి'' అనే తమిళ సినిమాలో జయప్రద నటిస్తోంది. మలయాళంలో కినరు అనే సినిమాకు రీమేక్‌గా కేణి తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయప్రద, పార్తిబన్ కలిసి నటిస్తున్నారు. ఓ సామాజిక సమస్య ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అయితే పవర్ ఫుల్ రోల్స్ మాత్రమే తాను పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని జయప్రద వెల్లడించింది. గతంలో బాహుబలిలో శివగామి పాత్ర కోసం హేమమాలిని, శ్రీదేవి, మంజు లక్ష్మి, రమ్య కృష్ణ వంటి పలువురిని రాజమౌళి సంప్రదించారట. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఆ చాన్సులను వదులుకున్నారు.
 
పవర్ ఫుల్ రోల్ కోసం జయప్రద ఆరాటపడుతున్న వేళ.. శివగామి రోల్ కోసం జయప్రదను రాజమౌళి సంప్రదించి వుంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. గత ఐదేళ్లలో విడుదలైన సినిమాల్లో పవర్ ఫుల్ వుమెన్ రోల్ ఏదంటే అది బాహుబలిలోని శివగామి పాత్రే. ఈ తరుణంలో పవర్ రోల్ కావాలంటున్న జయప్రద బాహుబలిలో శివగామి పాత్రను పోషించి వుంటే ఎలా వుంటుందనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments