Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యబాబోయ్.. పవన్‌తో సినిమానా... పారిపోతున్న యువ హీరోలు

మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "కాటమరాయుడు'' షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కిశోర్ పార్థసాని (డాలీ) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ రెండోసారి పవన్‌కు జోడీగ

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (15:47 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "కాటమరాయుడు'' షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కిశోర్ పార్థసాని (డాలీ) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ రెండోసారి పవన్‌కు జోడీగా నటిస్తుంది. కన్నడ నటి మానసహిమవర్ష మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇదిలావుంటే... ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించేందుకు ఇప్పుడు కొందరు యువ కథానాయకులు ముందుకు రావట్లేదు. 
 
అసలు విషయం ఏంటంటే.. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తమిళ హిట్ మూవీ ''వీరం''కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోకు నలుగురు తమ్ముళ్లుంటారు. వాళ్లు సినిమా అంతటా పవన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారు. ఐతే ఈ పాత్రల కోసం శర్వానంద్.. నవీన్ చంద్ర.. రాజ్ తరుణ్ లాంటి యువ కథానాయకుల్ని సంప్రదించారట. కానీ వీళ్లెవరూ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. కారణం.. ఒకేసారి 50 రోజుల బల్క్ డేట్స్ అడగడమే. ఈ ముగ్గురూ వేరే సినిమాలను ఒప్పుకున్నారు. ఆ సినిమాలు చేస్తూ పవన్ చిత్రానికి అన్నేసి డేట్లు కేటాయించడం అంటే కష్టం. 
 
పైగా పవన్ సినిమా అంటే ఒకరకమైన సందిగ్ధత ఉంటుంది. షూటింగ్ సజావుగా సాగదు. ఆలస్యం కావచ్చన్న సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే వీళ్లందరూ పవన్‌తో నటించే ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. దీంతో యూనిట్ మొత్తం తమ్ముళ్లను వెతికే పనిలో నిమగ్నమైపోయింది. ఎట్టకేలకు ఈ పాత్ర‌ల‌కు ముగ్గురు త‌మ్ముళ్లు దొరికార‌ట‌. ''గ‌బ్బ‌ర్‌సింగ్‌''లో పవ‌న్‌కి త‌మ్ముడిగా చేసిన అజ‌య్‌, ''అన్న‌వ‌రం'' సినిమాలో ప‌వ‌న్‌తో న‌టించిన శివ‌బాలాజీ, క‌మ‌ల్ కామ‌రాజులు ఈ పాత్ర‌లు చేయ‌నున్న‌ట్లు టాలీవర్గాలు అంటున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments