Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గౌతమీపుత్ర శాతకర్ణి'' చిత్రం కోసం బాలీవుడ్ నటీనటులపై కన్నేసిన బాలయ్య!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:21 IST)
బాలకృష్ణ వందో సినిమాపై వెలువడుతున్నవార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. బాలయ్య వందో సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ''గౌతమీపుత్ర శాతకర్ణి'' కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ తెరకెక్కించనున్న ఈ చారిత్రక సినిమాలో నటీనటులతో పాటు, సాంకేతికంగానూ ఈ సినిమాని వైవిధ్యభరితంగా చూపేందుకు దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 
 
అందులో భాగంగానే బాలీవుడ్ నటి హేమ మాలినిని తల్లి పాత్రకు ఎంపిక చేశాడు. అలాగే దర్శకుడు క్రిష్ బాలకృష్ణలు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం క్రిష్ ఈ చిత్రంలో నటీనటులను చాలా వరకు బాలీవుడ్ వాళ్ళని తీసుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. 
 
బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న క్రిష్ ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న చిత్రంతో అక్కడ కూడా క్యాష్ చేసుకొనే ఆలోచనలో ఉన్నాడట. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యుల్‌ని మొరాకోలో నెల రోజుల పాటు చేసేందుకు యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments