మరో స్టార్ కపుల్ బ్రేకప్? నీచమైన పుకార్లు నమ్మొద్దు

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (11:00 IST)
బాలీవుడ్ స్టార్ కపుల్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట విడిపోతున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మధ్య అర్జున్-మలైకా విడిగా వుంటున్నట్లు తెలుస్తోంది. . మలైకా సాధారణంగా అర్జున్ ఫ్యామిలీ డిన్నర్‌లకు అర్జున్‌తో కలిసి హాజరవుతుంటారు. కానీ తాజాగా అర్జున్ ఫ్యామిలీతో మలైకా కలవడం లేదని వార్తల సారాంశం. దాంతో స్టార్ కపుల్ అర్జున్‌ - మలైకా బ్రేకప్ అనే వార్త నెట్టింట హల్చల్ చేసింది. 
 
ఈ వార్తలపై అర్జున్ కపూర్ స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. మలైకాతో ఉన్న ఓ స్టైలిష్ పిక్ పోస్ట్ చేసి నీచమైన పుకార్లు నమ్మొద్దు అని ట్వీట్ చేశారు. 'నీచమైన పుకార్లకు అస్సలు స్థానం లేదు. సురక్షితంగా ఉండండి. ఆశీర్వాదంతో ఉండండి. ప్రజలకు శుభాకాంక్షలు. అందరినీ ప్రేమిస్తున్నాను' అంటూ రూమర్లకు కౌంటర్ ఇచ్చారు. 
 
మలైకాతో ఉన్న మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేయడం ద్వారా వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం అయింది. అర్జున్ పోస్ట్‌పై మలైకా కూడా స్పందించారు. హార్ట్ ఎమోజీ పోస్ట్ చేసి తమ మధ్య బంధం బాగుందని పేర్కొన్నారు. తారా సుతారియా, భూమి పెడ్నేకర్, అమృత అరోరా, సోఫీ చౌదరి, అతియా శెట్టి, తాహిరా కశ్యప్, అమీ జాక్సన్ కూడా అర్జున్ పోస్ట్‌పై స్పందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments