Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'లో వచ్చిన ఛాన్సులు మిస్ చేసుకుని కుళ్లుకుంటున్న తారలు ఎవరో తెలుసా?

బాహుబలి ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ స్టామినా చూపిస్తూ ముందుకు దూసుకువెళుతున్న చిత్రం. ఈ చిత్రంలో నటించిన తారల ఇమేజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. ఐతే బాహుబలి చిత్రం అనుకోగానే దర్శకుడు రాజమౌళి ప్రధాన పాత్రల్లో కొందరిని అనుకున్నారట. వారు ఆయన పిలుపుకు నో

Webdunia
గురువారం, 4 మే 2017 (20:54 IST)
బాహుబలి ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ స్టామినా చూపిస్తూ ముందుకు దూసుకువెళుతున్న చిత్రం. ఈ చిత్రంలో నటించిన తారల ఇమేజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. ఐతే బాహుబలి చిత్రం అనుకోగానే దర్శకుడు రాజమౌళి ప్రధాన పాత్రల్లో కొందరిని అనుకున్నారట. వారు ఆయన పిలుపుకు నో చెప్పడంతో ప్రత్యామ్నాయంగా కొందరిని తీసుకున్నారట. 
 
ఇంతకీ ఆ పాత్రలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. బాహుబలి తల్లి పాత్ర శివగామిగా శ్రీదేవిని అడిగారట. ఐతే అందుకు శ్రీదేవి నో చెప్పిందట. దానితో ఆ పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నారు. ఆ తర్వాత బాహుబలిలో కీలక పాత్ర కట్టప్ప. ఈ పాత్రకు తొలుత మలయాళ హీరో మోహన్ లాల్ ను అనుకున్నారట. ఆయనను సంప్రదిస్తే ఏడాదికే మూడు నాలుగు సినిమాలు చేసే మోహన్ లాల్, ఐదేళ్లపాటు ఒక్క సినిమా కోసమా అని తల అడ్డంగా ఊపారట. దాంతో ఆ పాత్రకు సత్యరాజ్ ను తీసుకున్నారట.
 
ఇక భల్లాల దేవ పాత్ర. ఈ పాత్రలో తొలుత వివేక్ ఒబెరాయ్ అయితే కరెక్ట్ అనుకున్నారట. ఆయన ఆ పాత్రలో చేయనని చెప్పడంతో రానాను అడిగారట. భల్లాల దేవ పాత్రకు ఎంత ప్రాముఖ్యత వచ్చిందో తెలియనిది కాదు. ఇక అవంతిక క్యారెక్టర్. ఈ పాత్రకు బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సోనమ్ కపూర్ అయితే సరిపోతుందని సంప్రదిస్తే ఆమె కూడా రెండుమూడేళ్ల కాల్షీట్లు ఎవ్వరికీ ఇవ్వకుండా చేయడం కష్టమని నో చెప్పేసిందట. దానితో ఆ పాత్ర తమన్నాను వరించింది. ఇక చివరిగా దేవసేన పాత్ర. 
 
బాహుబలి చిత్రంలో దేవసేనగా తొలుత నయనతారను అనుకున్నారట. నయనతార అన్నేళ్లపాటు ఒక్క చిత్రం కోసం కూర్చోవడం కుదరదని చెప్పడంతో అనుష్కకు ఇచ్చారట రాజమౌళి. అలా పాత్రలు చేజారిపోయినవారంతా తప్పు చేశామే అని నిట్టూర్పులు విడుస్తున్నారట. అదీ సంగతి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం