Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక-బిపాసాల మధ్య కోల్డ్ వార్.. రాధికకు అవకాశం ఎలా.. ఏంటి కారణం?

బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మన్ననలందుకున్న ప్రియాంక‌, బిపాస‌ మధ్య విభేదాలు వచ్చినట్లు ఇటీవలి కాలంలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకు ముందులా వీరి మధ్య స్నేహం లేదని.. అసంతృప్తులు గూడు కట్టుకున్నాయని

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:38 IST)
బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మన్ననలందుకున్న ప్రియాంక‌, బిపాస‌ మధ్య విభేదాలు వచ్చినట్లు ఇటీవలి కాలంలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకు ముందులా వీరి మధ్య స్నేహం లేదని.. అసంతృప్తులు గూడు కట్టుకున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై సినీ జనాలు, మీడియా పెద్ద చర్చే పెట్టారు. ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందని అంటున్నారు. దీనికి కార‌ణం బిపాస పెళ్లి విష‌యాన్ని ప్రియాంకానే లీక్ చేసింద‌ని సమాచారం. 
 
అంతేకాక ప్రియాంక నిర్మాత‌గా వ్యాపారవేత్త కల్పనా సరోజ్‌ జీవితం ఆధారంగా ఓ చిత్రం నిర్మించబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను బిపాసా చేస్తుంద‌న్నా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్రియాంక బిపాసాను పక్కకు నెట్టి తన సినిమాలో రాధికకు అవకాశం ఇచ్చిందట. పెళ్లి తర్వాత ఎలాంటి సినిమాలు చేతిలో లేకపోవడంతో బిపాసా ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. 
 
ప్రియాంక మాత్రం సినిమాకు సరిపోయే వారినే ఎంపిక చేసుకోవాలని కానీ స్నేహితులైనంత మాత్రాన ఎవరి పడితే వారికి అవకాశం ఇవ్వకూడదని భావించి రాధికకు అవకాశం ఇచ్చిందని చెప్పింది. దీంతో సినిమాలు చేతిలో లేక కాలిగా ఉన్న బిపాస‌కు ఈ చిత్రం కూడా ద‌క్క‌క‌పోవడంతో ప్రియాంక‌తో క‌టీఫ్ చేసుకుంద‌ట‌. ప్రియాంకను అవకాశం అడుగడం ఇష్టంలేకే నేను వెనకడుగు వేశానంటూ బిపాసా చెప్పడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments