Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీమంతుడుకి సీక్వెల్ రాబోతుందా? భరత్ అను నేను టైటిల్ ఫిక్స్ చేస్తారా?

ఊరికోసం ఏదైనా చేయాలనే కాన్సెప్టుతో వచ్చిన మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా తర్వాత గ్రామాలను దత్తత తీసుకోవడం, ఊరి బాగు కోసం మంచి చేయడం లాంటివి చాలామంది ఆచరిస్తున్నారు. మహేష్ బాబు కూడా స్వయంగా దీన్ని ఆచరి

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (12:49 IST)
ఊరికోసం ఏదైనా చేయాలనే కాన్సెప్టుతో వచ్చిన మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా తర్వాత గ్రామాలను దత్తత తీసుకోవడం, ఊరి బాగు కోసం మంచి చేయడం లాంటివి చాలామంది ఆచరిస్తున్నారు. మహేష్ బాబు కూడా స్వయంగా దీన్ని ఆచరిస్తూ... అభిమానులు తన దారిలో నడిచేలా చేస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
 
ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనులను మహేష్ బాబు సతీమణి నమ్రత చూసుకుంటన్నారు. ఈ నేపథ్యంలో శ్రీమంతుడు కాన్సెప్ట్ చాలామందికి నచ్చేసింది. ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు హిట్ కొట్టేసింది. 
 
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీమంతుడు హీరోయిన్ శృతిహాసన్‌ని ఫైనల్ చేసే ఆలోచనలో వున్నాడట కొరటాల. మహేష్-శృతి పెయిర్ వర్కవుట్ కావడంతో ఈ కాంబోని రిపీట్ చేయాలని ఆలోచిస్తున్నాడట డైరక్టర్. 
 
మ్యూజిక్ డైరెక్టర్ దేవితో అప్పుడే మ్యూజిక్ సిట్టింగ్ మొదలుపెట్టాడు కొరటాల. దీనికి 'భరత్ అను నేను' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా దేవి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం మురుగదాస్‌తో మహేష్ ప్రాజెక్ట్ ఫినిష్ కాగానే కొరటాల మూవీ సెట్స్ మీదకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments