Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిష్ 'అహం బ్ర‌హ్మాస్మి' హీరో ఇత‌నే..!

గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి... ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ క్రిష్. ప్ర‌స్తుతం క్రిష్ మ‌ణిక‌ర్ణిక అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (13:31 IST)
గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి... ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ క్రిష్. ప్ర‌స్తుతం క్రిష్ మ‌ణిక‌ర్ణిక అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే... క్రిష్ అహం బ్ర‌హ్మాస్మి అనే టైటిల్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి నిర్మించ‌నున్నారు. అయితే.. క్రిష్ టైటిల్ అయితే ఎనౌన్స్ చేసాడు కానీ... ఇందులో న‌టించే హీరో ఎవ‌రు అనేది మాత్రం చెప్ప‌లేదు. 
 
దీంతో ఈ సినిమాలో కథానాయకుడు ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బాలకృష్ణకి క‌థ చెప్ప‌డం ఆయ‌న ఓకే అన‌డం జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మణికర్ణిక తరువాత క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ చేసే సినిమా ఇదేనని చెబుతున్నారు. 
 
బాలకృష్ణ .. క్రిష్ కాంబినేషన్లో గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చింది. చారిత్రక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. బాలకృష్ణ 100వ సినిమాగా రూపొందిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ కాంబినేషన్లో 'అహం బ్రహ్మాస్మి  అనే సినిమా రాబోతుంద‌ని తెలిసి బాలయ్య అభిమానులకు చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. మ‌రి... ఇందులో బాల‌య్య‌ను క్రిష్ ఎలా చూపించ‌నున్నాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments