Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఉయ్యాలవాడ' కోసం బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కోసం చెర్రీ వేట... 'బాహుబలి'తో బెదుర్స్...

ఇప్పుడు ఎవరు సినిమా తీయాలన్నా బాహుబలి రికార్డుల వైపే చూస్తున్నారు. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు చేయాలంటే ఖచ్చితంగా బాహుబలి చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని తీయాలనుకుంటున్నారు. తాజాగా చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఇదే తోవలో నడుస్తున్న

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (13:56 IST)
ఇప్పుడు ఎవరు సినిమా తీయాలన్నా బాహుబలి రికార్డుల వైపే చూస్తున్నారు. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు చేయాలంటే ఖచ్చితంగా బాహుబలి చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని తీయాలనుకుంటున్నారు. తాజాగా చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఇదే తోవలో నడుస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి చిత్రం కావడంతో భారీ తారాగణాన్ని ఇందులో నటింపజేయాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు మార్కెట్టును దృష్టిలో పెట్టుకుని చెర్రీ తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్యా రాయ్ అయితే బావుంటుందని ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంకా మరో పవర్‌ఫుల్ పాత్రలో సల్మాన్ ఖాన్‌ను అడిగినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగూ తెల్లదొరల కాలం నాటి సినిమా కాబట్టి హాలీవుడ్ నటులను కూడా తీసుకుంటే మరికాస్త రేంజ్ పెరుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తమ్మీద బాహుబలి స్థాయిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించాలన్న ప్రయత్నమైతే జరుగుతుందని చెప్పొచ్చు. మంచి పరిణామమే...!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments