Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి సీన్స్ లీక్... రాజమౌళికి నోటీసులు...?!

Webdunia
మంగళవారం, 10 మార్చి 2015 (17:08 IST)
ఆశ్చర్యపోకండి.. నిజంగానే దర్శకుడు రాజమౌళికి హైదరాబాద్‌లో సిసిఎస్‌ పోలీసులు నోటీసులు జారీచేయనున్నారు. విషయం ఏమంటే... ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన 'బాహుబలి' సినిమా గురించి. జనవరిలో చిత్ర నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాలోని యుద్ధ సన్నివేశాలు కొన్ని బయటకు వచ్చాయి. ఇవి గత నెలలో పోలీసులు శోధించి.. గ్రాఫిక్స్‌ వర్క్‌లో పనిచేస్తున్న మూర్తి ద్వారా వచ్చాయని నిర్ధారణ చేశారు. కానీ అతను ప్రస్తుతం పనిచేయడం లేదట. 
 
బయటకు వచ్చిన సీన్స్‌ పోలీసుల వద్ద వున్నాయి. నిర్మాత ఫిర్యాదు మేరకు పోలీసులు రాజమౌళిని పిలిపించి.. అసలు బాహుబలిలోని నిజమైన సీన్స్‌ బయటకు వచ్చాయా? లేక ఇదేమైనా డ్రామానా? అని లేదంటే.. మూర్తి డూప్లికేట్‌గా సీన్స్‌ బయటకు తెచ్చాడా? అనేది ఆరా తీయనున్నారు.
 
ఇవి తెలవాలంటే.. ముందుగానే రాజమౌళిని పోలీసు కార్యాలయానికి పిలిపించాలి. అందుకు ముందుగా నోటీసులు ఇవ్వాలి.. అదన్నమాట. మరో రెండు రోజుల్లో రాజమౌళికి నోటీసులు ఇస్తామని.. ఆయన వచ్చి తమకు క్లారిటీ ఇస్తే సరిపోతుందనీ, లేకపోతే... ఇవి మార్ఫింగ్‌ చేసిన దృశ్యాలుగానే పరిణగణిస్తూ... ఇంత గొడవ చేసినందుకు తిరిగి కేసు కూడా పెట్టవచ్చని నిర్మాతకు సూచించారట. బాహుబలి లీకుల గొడవ ఎంతవరకు వెళుతుందో మరి...!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments