Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లోనూ క్యూ కట్టారు... సరిహద్దులు దాటిన "బాహుబలి" మేనియా...

'బాహుబలి' మేనియా సరిహద్దులను దాటిపోయింది. ఇండో - పాక్ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనివుంటే.. పాకిస్థాన్‌లో మాత్రం 'బాహుబలి 2' చిత్రం టిక్కెట్ కోసం ఆ దేశ ప్రజలు క్యూకట్టారు.

Webdunia
ఆదివారం, 7 మే 2017 (17:26 IST)
'బాహుబలి' మేనియా సరిహద్దులను దాటిపోయింది. ఇండో - పాక్ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనివుంటే.. పాకిస్థాన్‌లో మాత్రం 'బాహుబలి 2' చిత్రం టిక్కెట్ కోసం ఆ దేశ ప్రజలు క్యూకట్టారు. భారత్‌లో "బాహుబలి 2" చిత్రం గత నెల 28వ తేదీన విడుదలైంది. కానీ, పాకిస్థాన్‌లో ఒక వారం రోజులు ఆలస్యంగా విడుదలైంది. భారత్‌లో ఇప్పటికే సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా ఈ చిత్రం ప్రదర్శితమవుతుంటే... పాకిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 
 
తొలిరోజునాడు పాకిస్థాన్‌లోని ప్రముఖ పట్టణాలైన కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌లలో 'బాహుబలి 2' కోసం ప్రేక్షకులు క్యూలు కట్టడంతో థియేటర్లు కిక్కిరిసాయి. దీంతో థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా పాకిస్థానీయులు కూడా 'బాహుబలి 2'కి పట్టాభిషేకం కట్టే దిశగా సినిమా హాళ్ళకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రూ.1000 కోట్లు దాటిన ఈ సినిమా కలెక్షన్స్‌ను మరింత పెంచేందుకు పాకిస్థాన్ మార్కెట్ కూడా ఓ చేయి వేస్తుందన్న విషయం స్పష్టమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments