Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా కైఫ్ అలసిపోయింది.. కారులో కూర్చునే కునుకు తీసింది.. సోషల్ మీడియాలో వైరల్

కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన 'బార్ బార్ దేఖో' చిత్రం త్వరలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. విడుదల సమయానికి సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతల

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (16:54 IST)
కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన 'బార్ బార్ దేఖో' చిత్రం త్వరలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. విడుదల సమయానికి సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమా సంబంధించిన ట్రైలర్, సాంగ్స్, హాట్ ఫోటోస్.... ఇలా రోజుకోటి రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. "కాలా చష్మా సాంగుతో'' ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. ఆ సాంగ్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా వైపు మళ్లింది. తర్వాత విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 
 
ఈ చిత్రానికి నిత్యా మెహ్రా దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం కొన్ని రోజులు చాలా కష్టపడ్డాం అని చెప్పిన హీరో సిద్ధార్థ్.. కత్రినాతో కలసి మూవీ ప్రమోషన్ కోసం ఇండోర్ వెళ్లాడు. బిజీబిజీ షూటింగ్ షెడ్యూల్స్, ఆ వెంటనే ప్రమోషన్ల కోసం జర్నీ చేయడంతో ముద్దుగుమ్మ కత్రినా చాలా అలసిపోయింది. దీంతో వీరిద్దర ప్రయాణిస్తున్న కారులో కూర్చున్న కత్రినా అలాగే కాస్త కునుకు తీసింది. 
 
పక్కనే కూర్చున్న సిద్ధార్థ్ ఆ దృశ్యాన్ని ఫొటో తీశాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానికింద కత్రినాలాగ ఎవరైనా నిద్రపోగలరా అని కాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది. దాంతో పాటు కొన్ని డ్యాన్స్ సీన్లను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ మూవీకి విపరీతమైన ప్రచారం లభించింది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలకానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments