Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ డైరెక్ట్ హిందీ సినిమా.. నిర్మాత కరణ్ జోహర్.. మరి దర్శకుడూ.. ఇంకెవ్వరు రాజమౌళే..

బాహుబలి సినిమా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యాక్టర్ ప్రభాస్‌లపై కరణ్‌కి మంచి నమ్మకం, స్నేహం ఏర్పడ్డాయి. దీంతో ఈసారి హిందీలో మళ్లరాజమౌళి-ప్రభాస్‌ల కాంబినేషన్‌లో సినిమాని నిర్మించడానికి కరణ్ ప్లాన్ చేస్తున్నట్టు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (04:18 IST)
ఏ తెలుగు హీరోకూ దొరకని అపూర్వ గుర్తింపు బాహుబలి హీరో ప్రభాస్ సొంతమైంది. తెలుగు సినిమాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ బాహుబలి చిత్రంతో అంగుష్టమాత్రుడు మహాకాయుడైన చందాన జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందాడు. ఇప్పుడా గుర్తింపు బాలీవుడ్‌లోనే ప్రముఖ సినిమా నిర్మాత నేరుగా అతడితోనే సినిమా నిర్మించే స్థాయికి తనను తీసుకెళ్లింది.
 
బాహుబలి ది బిగినింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి బాలీవుడ్ ఆడియెన్స్‌కి సుపరిచితుడైన ప్రభాస్ త్వరలోనే బాలీవుడ్‌లో ఓ డైరెక్ట్ మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. బాహుబలి సినిమాను హిందీ ఆడియెన్స్‌కి అందించిన కరణ్ జోహర్ అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. బాహుబలి సినిమా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యాక్టర్ ప్రభాస్‌లపై కరణ్‌కి మంచి నమ్మకం, స్నేహం ఏర్పడ్డాయి. దీంతో ఈసారి హిందీలో మళ్లీ రాజమౌళి-ప్రభాస్‌ల కాంబినేషన్‌లో సినిమాని నిర్మించడానికి కరణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
 
'బాహుబలి 2' తర్వాత 'రన్ రాజా రన్ ఫేమ్' సుజీత్ రెడ్డి డైరెక్షన్‌లో 'సాహో' సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా పూర్తయిన తర్వాత కరణ్‌తో సినిమా వుండవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 28న బాహుబలి-2 రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం ప్రభాస్ ఎక్కువ సమయం ఈ సినిమా ప్రమోషన్స్‌కే కేటాయిస్తున్నాడు. బాహుబలి-2 ప్రమోషన్స్ పూర్తయితే, ఆ తర్వాత పూర్తిగా సుజీత్ సినిమాకే టైమ్ కేటాయించనున్నాడు ప్రభాస్.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటూ వచ్చిన తండ్రి.. నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన తండ్రి.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments