Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవసేన ఫిగర్ కోసం హైదరాబాద్ రోడ్లపై మాస్క్ వేసుకుని సైక్లింగ్ చేస్తోన్న స్వీటీ..

అనుష్క సైజ్ జీరో కోసం ప‌డుతున్న క‌ష్టాలు ఇన్నీ అన్నీ కావు.. సైజ్ జీరో కోసం పెరిగిన బ‌రువు ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా స్లిమ్ కావ‌డం లేద‌ట‌.. ఇదే విష‌యాన్ని

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (12:44 IST)
అనుష్క సైజ్ జీరో కోసం ప‌డుతున్న క‌ష్టాలు ఇన్నీ అన్నీ కావు.. సైజ్ జీరో కోసం పెరిగిన బ‌రువు ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా స్లిమ్ కావ‌డం లేద‌ట‌.. ఇదే విష‌యాన్ని రాజ‌మౌళి ఆమె దృష్టికి తీసుకెళ్లాడు. రాజమౌళి ప్రస్తుతం ''బాహుబలి 2'' క్లైమాక్స్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. 
 
ఈ సినిమా ఔట్ ఫుట్ పై సంతృప్తిగానే ఉన్నా… అనుష్క‌ విషయంలో మాత్రం రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తున్నాడట. 'బాహుబలి' తొలి భాగంలో ''దేవసేన''గా అనుష్క కేవలం ఓల్డేజ్ గెటప్‌లో మాత్రమే కనిపించింది. కానీ, ''బాహుబలి 2''లో బాహుబలి ప్రియురాలిగా, భల్లాలదేవుడు ఇష్టపడే అమ్మాయిగా, అందాల రాణిగా దేవసేన కనిపించాలి. అయితే, ఇప్పుడు దేవసేనకు సంబంధించిన సీన్స్ తెరకెక్కించడానికి అనుష్క సైజ్ ఇంకా సెట్ కాకపోవడంతో జక్కన్న ఆమెపై ఫైర్ అవుతున్నాడట. యోగా ద్వారా ఫలితం ఉండదని లైపో ట్రీట్‌మెంట్‌ తీసుకోమని అనుష్కకు రాజమౌళి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. 
 
దాంతో స్వీటీ చేసేది లేక హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్‌తో చక్కర్లు కొడుతోంది. బరువు తగ్గడం కోసం ఇన్నాళ్లు చేసిన యోగా, జిమ్‌లో ఇతర వ్యాయామాలు ఏవీ అనుష్కకు ఉపయోగపడలేదట. చివరకు, ముఖానికి మాస్క్ వేసుకుని ప్రతి రోజూ ఉదయం హైదరాబాద్ రోడ్ల మీద 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తోందని సన్నిహితులు అంటున్నారు. వెయిట్ పెరగడానికి ఎక్కువ కష్టపడని అనుష్క, తగ్గడానికి మాత్రం చాలా కష్టపడుతోందట. ప్రస్తుతం దేవసేన ''బాహుబలి 2'', ''భాగమతి'', ''సింగం 3'', ''ఓం నమో వెంకటేశాయ'' చిత్రాల్లో నటిస్తోంది. మరి స్వీటీ రాజమౌళికి సహకరిస్తుందో లేదా హ్యాండిస్తుందో చూడాలి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments