Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 మరో రికార్డు... మూడు రోజుల్లో రూ.500 కోట్లు దాటేసింది...

బాహుబలి 2 చిత్రం సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్టు సమాచారం. బాక్సాఫీస్‌ ఇండియా డాట్‌ కామ్‌ ప్రకారం గడి

Webdunia
సోమవారం, 1 మే 2017 (15:54 IST)
బాహుబలి 2 చిత్రం సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్టు సమాచారం. బాక్సాఫీస్‌ ఇండియా డాట్‌ కామ్‌ ప్రకారం గడిచిన మూడు రోజుల్లో బాహుబలి 2 కలెక్షన్ల సునామీతో రూ.506 కోట్లను వసూళ్లు చేసింది. ఇది ప్రివ్యూలతో కలిపితే రూ.520 కోట్లు. ఇందులో ఒక్క భారత్‌లోనే మొత్తం వసూళ్లు రూ.385కోట్లు ఉండగా.. విదేశాల్లో రూ.121 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 
 
ముఖ్యంగా ఓవర్సీస్ దేశాలైన అమెరికా, కెనడా, గల్ఫ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది వరకు ఉన్న రికార్డులు అన్ని కూడా ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయని బాక్సాఫీస్‌ ఇండియా పేర్కొంది. 'బాహుబలి ది బిగినింగ్‌'కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి కన్‌క్లూజన్‌ గొప్ప విజువల్‌ ఎఫెక్ట్స్‌తోపాటు మంచి కథాబలం తోడవడంతో దుమ్మురేచిపోయే రేంజ్‌లో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. 
 
కాగా, ఈనెల 28వ తేదీన విడుదలైన  ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, వచ్చే వారాంతం వరకు అన్ని థియేటర్లలో టిక్కెట్లు బుక్క అయిపోయాయి. దీంతో 'బాహుబలి' చిత్రం రూ.వెయ్యి కోట్ల మేరకు వసూళ్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments