Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య... బి. గోపాల్‌ కాంబినేషన్‌ ఒకప్పుడు... మరి ఇప్పుడు!

Webdunia
గురువారం, 24 జులై 2014 (17:10 IST)
బాలయ్య.. బి. గోపాల్‌ కాంబినేష్‌ అనగానే లారీ డ్రైవర్ నుంచి సమరసింహారెడ్డి వరకు ఎన్నో చిత్రాలు వారి కలయికలో మంచి మాస్‌ చిత్రాలుగా ఫ్యాన్స్‌కు విందుగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత్తర్వాత కొత్తగా వస్తున్న దర్శకుల ధాటికి బి.గోపాల్‌ సరిపోలేదనే చెప్పాలి. 
 
దాసరి నారాయణరావు కూడా అదే కోవలో చెందినవాడే. ఒకప్పుడు లెజెండ్రీ మూవీస్‌ తీసిన ఆయన కూడా ఇప్పటి పరిశ్రమలో ఉన్న పద్ధతుల్ని జీర్ణించుకోలేక దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. అయితే బి.గోపాల్‌ మాత్రం... ఎన్‌టిఆర్‌ జూనియర్‌తో 'నరసింహుడు' అనే సినిమాను తీసి.. చేదు అనుభవాన్ని దక్కించుకున్నాడు. అతనిలో సరైన క్లారిటీ లేక... పాత ధోరణిలో పోవడంతో ఇప్పటి ట్రెండ్‌కు ఆకట్టుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం తాను బాలయ్యబాబుతో సినిమా చేయాలనుందని పుట్టినరోజు సందర్భంగా వెల్లడించాడు.
 
గురువారం అంటే జూలై 24న పుట్టినరోజు.... పెద్దగా పుట్టినరోజులు జరుపుకోని బి.గోపాల్‌.... రెండేళ్ళనాడు బెల్లంకొండ సురేష్‌ నిర్మాతగా... బాలయ్యబాబుతో ఓ సినిమాకు అంకురార్పణ చేశాడు. మాదాపూర్‌లోని నోవాటెల్‌ హోటల్‌ కాంపౌండ్‌లో వైభవంగా జరిగిన ఆ సినిమా సెట్‌పైకి వెళ్ళలేదు. కథలో సరైన క్లారిటీ లేక బాలయ్య వెనకడుగు వేశాడు. అప్పట్లో ముంద్రించిన పోస్టర్లు.... కమల్‌ హాసన్‌, సూర్య వంటి ఎందరివో బాడీలు పెట్టి తలకాయ బాలయ్యబాబుది పెట్టారు. తీవ్ర విమర్శలకు గురైనా ఆ చిత్రం సెట్‌పైకి వెళ్ళలేదు.
 
కాగా, ఈ ఏడాది నయనతార, గోపీచంద్‌ సినిమా కూడా అలాగే తయారైంది. నిర్మాత వల్లనో, మరి దేనివల్లనో కొన్ని ఇబ్బందులు తల ఎత్తాయి. దాంతో 30 శాతం చిత్రీకరణ పూర్తయిన చిత్రాన్ని ఆపేశారు. ఫైనాన్స్‌ పరంగా అడ్డంకులున్నాయని ఫిలింనగర్‌ కథనం. ప్రస్తుతం ఆ చిత్రం మళ్ళీ కదలనున్నదని బి.గోపాల్‌ చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా... ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లే దర్శకులు మారాలని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments