Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట చిత్రానికి అస‌ని దెబ్బ‌!

Webdunia
బుధవారం, 11 మే 2022 (11:52 IST)
Maheshbabu
మ‌హేష్‌బాబు న‌టించిన సర్కారు వారి పాట విడుద‌ల‌కు అన్ని అడ్డంకులే క‌నిపించాయి. అంత‌కుముందు క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డుతూ పుష్ప‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌. వ‌ల్ల పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వ‌చ్చింది. అన్నీ అధిగ‌మించి ఇప్పుడు మే 12న విడుద‌ల కాబోతుంది. అయితే ఈ విడుద‌ల‌కుముందు నుంచే ఆంధ్ర‌, ఒరిస్సా త‌దిత‌ర ప్రాంతాల్లో అస‌ని తుఫాన్ రావ‌డంతో ఆ ప్ర‌భావం సర్కారు వారి పాట సినిమాపై తీవ్ర ప్ర‌భావం చూపబోతున్న‌ట్లు సినీ విశ్లేష‌కులు తెలియ‌జేస్తున్నారు.
 
గ‌త కొద్దిరోజులుగా తెలంగాణ‌లోనూ  గాలివాన‌తోకూడిన అకావ‌ల వ‌ర్షాలు రావ‌డంతో రైతులు చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ఇక ప‌ట్ట‌ణాల‌లో లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడు ఆంధ్ర‌లోని నెల్లూరు, వైజాగ్‌, విజ‌య‌వాడ త‌దిత‌ర‌ప్రాంతాల‌తోపాటు గ్రామీణ ప్రాంతాల‌ల‌లో ఈ అస‌ని తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా వుంది. మ‌రోవైపు రిలీజ్ తేదీ వాయిదా వేస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే ఇత‌ర సినిమాల‌పై ఎఫెక్ట్ వుంటుంది. త‌ర్వాత ఎఫ్‌3 రాబోతుంది. ఒక‌వేళ పోస్ట్ పోన్ అయితే థియేట‌ర్ల స‌మ‌స్య‌కూడా త‌లెత్తుంది. రేపే విడుద‌ల‌కాబోతున్న  సర్కారు వారి పాట తుఫాన్ వ‌ల్ల ఓపెనింగ్ బాగా త‌గ్గేసూచ‌న‌లు తీవ్రంగా క‌నిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments