Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సరసన హీరోయిన్ ఛాన్స్: నో చెప్పిన అనుష్క.. శ్రుతిహసన్‌కి ఆఫర్

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని రీఎంట్రీ ఫిలిమ్‌ ఖైదీ నంబర్ 150తో కెరీర్‌లోనే అత్యంత అధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి అంతటివాడికే అనుష్క ఝలక్ ఇచ్చిందా... గత కొంత కాలంగా టాలివుడ్‌లో ఇది పెద్ద వార్త. చిరు 151వ స

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (04:52 IST)
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని రీఎంట్రీ ఫిలిమ్‌ ఖైదీ నంబర్ 150తో కెరీర్‌లోనే అత్యంత అధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి అంతటివాడికే అనుష్క ఝలక్ ఇచ్చిందా... గత కొంత కాలంగా టాలివుడ్‌లో ఇది పెద్ద వార్త. చిరు 151వ సినిమాకు తొలుత అనుష్కను సంప్రదించినా నో చెప్పిందని వరుస కథనాలు వెలువడ్డాయి.  
 
అసలు ఖైదీ నంబర్ 150 సినిమా కోసం హీరోయిన్‌గా ఎవర్ని ఎంపిక చేయాలన్నదానిపై ఎక్కువ సమయం గడిపారు. చివరకు కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తాజాగా చిరంజీవి 151వ సినిమాకూ హీరోయిన్ ఎంపికే కష్టం అవుతోందట. ఇంకా సినిమానే ఖరారు కాలేదు కానీ.. హీరోయిన్ దాకా ఎందుకు అని ఆలోచిస్తున్నారా అంటే హీరోయిన్ల డేట్లు దొరకడం చిరంజీవి అంతటి మెగా స్టార్‌కి కూడా కష్టమైపోతోందని సమాచారం. 
 
దీనికి సంబంధించి మరో వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ముందుగా అనుకున్నట్లు అనుష్కకే హీరోయిన్ చాన్స్ ఇవ్వాలని అనుకున్నా బదులు శ్రుతి హాసన్‌‌ను తీసుకునే ఆలోచన చేస్తున్నారని టాక్. అయితే.. మెగాస్టార్ పక్కన శ్రుతి హాసన్ నప్పుతుందా అంటే.. నప్పేలా ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నారట. మరి, చిరంజీవితో చాన్స్ అంటే శ్రుతి హాసన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడతారా (Vide)

విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు.. ఎలా?

మహిళ హత్య కేసు - వైకాపా మాజీ ఎంపీ నదింగంకు సుప్రీంకోర్టు షాక్!!

తూర్పు తీరంలో ప్రగతిహారాల్లా భాసిల్లే ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments