Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీతో అనుష్క.. మలయాళ సినిమాలపై కన్నేసింది.. మంచి స్క్రిప్ట్ దొరికితే?

"గురు" సినిమా తర్వాత విక్టరీ వెంక‌టేష్ మ‌ల్టీ స్టార‌ర్‌ చిత్రంలో నటించనున్నాడు. నేనే రాజు నేనే మంత్రితో చాలాకాలం త‌రువాత సక్సెస్ సాధించిన తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీ

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (16:48 IST)
"గురు" సినిమా తర్వాత విక్టరీ వెంక‌టేష్ మ‌ల్టీ స్టార‌ర్‌ చిత్రంలో నటించనున్నాడు. నేనే రాజు నేనే మంత్రితో చాలాకాలం త‌రువాత సక్సెస్ సాధించిన తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. వెంకీతో రానా కలిసి నటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఒక హీరోయిన్‌గా అనుష్కను ఎంపిక చేశారు. 
 
మ‌రో హీరోయిన్ పేరును నవంబర్ 16వ తేదిన ప్ర‌క‌టించ‌నున్నారు.. అదే రోజున ఈ మూవీకి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి షూటింగ్‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, ఏకే.ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో వెంకీతో నటిస్తూనే అనుష్క మలయాళ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా పేరు సంపాదించిన అనుష్క.. మలయాళ సినిమాల గురించి మాట్లాడుతోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ తలెత్తుకునేలా మలయాళ సినిమా చేయగలదని.. తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తున్నాయని తెలిపింది. 
 
మలయాళ ప్రేక్షకులకు సినిమాలపై మంచి అవగాహన ఉందనీ .. అక్కడి సినిమాల్లో ఎంతటి కథాబలం వుంటుందనే విషయం తాను సినిమాల్లోకి వచ్చాక అర్థమైందని అనుష్క చెప్పింది. స్క్రిప్ట్ బాగుంటే చేసేస్తానని అనుష్క అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

దూడ కోసం సింహాలు వేట.. ఒంటరి పోరు చేసిన బర్రె.. తర్వాత ఏం జరిగిందంటే? (video)

ఆడవాళ్లకు అక్కా కాని.. మగవాళ్లకు బావా కాని వ్యక్తి నారా లోకేశ్ : గోరంట్ల మాధవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments