Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నజాజిలా మారిన అనుష్క.. అజిత్ విశ్వాసంలో నటిస్తోందట..

బాహుబలి దేవసేన అనుష్క శెట్టి అజిత్ సినిమాలో కనిపించనుందని తెలిసింది. ఎంతవాడు కానీ (తమిళంలో ఎన్నైఅరిందాల్) సినిమాలో అజిత్‌తో జతకట్టిన అనుష్క శెట్టి... తాజాగా అజిత్ 58వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని క

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (14:14 IST)
బాహుబలి దేవసేన అనుష్క శెట్టి అజిత్ సినిమాలో కనిపించనుందని తెలిసింది. ఎంతవాడు కానీ (తమిళంలో ఎన్నైఅరిందాల్) సినిమాలో అజిత్‌తో జతకట్టిన అనుష్క శెట్టి... తాజాగా అజిత్ 58వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అనుష్క ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
స్టార్ హీరోయిన్స్ ఎందరున్నా.. అనుష్కకు వున్న క్రేజే వేరు. హీరోలకు సరిసమానంగా ఆమె ఫాలోయింగ్ ఉంటుంది. బాహుబలి, అరుంధతి, రుద్రమదేవి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో సూపర్ క్రేజ్ కొట్టేసిన అనుష్క.. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగింది. ఇటీవల సన్నబడి మళ్లీ తన నాజూకు అందాలతో మురిపిస్తోంది. 
 
ప్రస్తుతం అనుష్క భాగమతి మూవీలో బిజీబిజీగా ఉంది. ఈ మధ్యన విడుదల చేసిన లుక్‌లో అనుష్క మెరపుతీగలా దర్శనమిచ్చింది. ఈ స్టార్ బ్యూటీ తమిళ క్రేజీ హీరో అజిత్‌ కోసమే నాజూగ్గా తయారైందని.. విశ్వాసం అనే చిత్రంలో అజిత్ సరసన అనుష్క నటించబోతుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. వీరం, వేదాలం వంటి సినిమాలను తెరకెక్కించిన శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments